Wednesday, November 4, 2020

EPF Balance Check using mobile in 4 ways



Read also:

EPF Balance Check using mobile  in 4 ways

EPF Balance Check-దీపావళి నాటికి వడ్డీ జమ అవుతుంది కాబట్టి ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది. ఎంత వడ్డీ జమ అయిందో తెలుస్తుంది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్-EPF ఉన్నవారికి శుభవార్త. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని దీపావళి నాటికి ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట ఈ వడ్డీని రెండు విడతల్లో చెల్లిస్తామని ప్రకటించింది. కానీ మొత్తం వడ్డీని ఒకే విడతలో చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. 6 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లకు దీపావళి నాటికి అకౌంట్లలో వడ్డీ జమ కానుంది. కాబట్టి ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం అవసరం. వడ్డీ రాకపోతే ఆ తర్వాత ఈపీఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తే వడ్డీ జమ అయిందో లేదో తెలుస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మరి బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

SMS: ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం 'షార్ట్ కోడ్ ఎస్ఎంఎస్ సర్వీస్' గతంలోనే ప్రారంభించింది ఈపీఎఫ్ఓ. 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ బ్యాలెన్స్ తెలుస్తుంది. మరి ఎస్ఎంఎస్ ఏ ఫార్మాట్‌లో పంపాలో, తెలుగులో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఎస్ఎంఎంస్ ఎలా పంపాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

UMANG App: ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. భారత ప్రభుత్వం రూపొందించిన యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్-UMANG యాప్ ద్వారా అనేక ప్రభుత్వ సేవల్ని పొందొచ్చన్న సంగతి తెలిసిందే. ఇందులో ఈపీఎఫ్ఓ సేవలు కూడా లభిస్తాయి. ఉమాంగ్ యాప్‌లో బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Missed Call: మీ దగ్గర ఫోన్ ఉందా? క్షణాల్లో మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్ నెంబర్‌ను యూఏఎన్ అకౌంట్‌తో లింక్ చేసి ఉండాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మీ చాలు. పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తాయి.

EPFO Portal: మీ దగ్గర యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఉంటే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా https://www.epfindia.gov.in/ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Our Services ట్యాబ్‌లో for employees సెలెక్ట్ చేయాలి. Services ఆప్షన్‌లో Member passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు.

ఈ నాలుగు పద్ధతుల ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ సులువుగా తెలుసుకోవచ్చు.

AP Teachers School Roll Particulars & Teachers Information

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :