Monday, November 23, 2020

Diabetes Diet fruits



Read also:

బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే.కాలం ఏదైనా ఇబ్బందే. ఐతే.శీతాకాలంలో కొన్ని రకాల పండ్లను తీసుకుంటే.డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

Health Benefits of Fruits : ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలోని సగం మంది డయాబెటిస్ పేషెంట్లు.ఇండియా, చైనాలోనే ఉన్నారు. ఒత్తిడి, చెడు అలవాట్లు, ఎక్కువగా చక్కెర, పిండి పదార్థాల (ఈ పిండి పదార్థాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది) వాడకం వల్ల టీనేజర్లు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈమధ్య ఎవరైనా షుగర్ బారిన పడినవారు మీకు తెలిస్తే.వాళ్లను బాగా ఎక్సర్‌సైజ్ చెయ్యమని చెప్పండి. అలాగే.ఈ కింది ఆహారం తీసుకోమని సూచించవచ్చు.

డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే.సాల్ట్ ఎక్కువగా ఉండే చిరుతిళ్లు, స్నాక్స్, ఫ్రైలు, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ (చిప్స్, స్నాక్స్ వంటివి) ఎక్కువగా తినకూడదు. వీటి బదులు ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే.కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ని ఎక్కువగా తీసుకోవాలి. వింటర్ (శీతాకాలం)లో అలాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు కొన్ని ఉన్నాయి.

Oranges : కమలాలు, బత్తాయిలు సీతాకాలంలో బాగా వస్తాయి. వీటిలో తీపి, పులుపు రెండు రుచులూ ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్లకు చాలా మేలు చేస్తాయి. వీటిలోని ఫైబర్.రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌‍లో ఉంచుతుంది.

Guava : జామకాయలో ఫైబర్ బోలెడంత ఉంటుంది. ఫైబర్ అనేది.మనం తినే ఆహారాన్ని వెంటనే జీర్ణం కానివ్వదు. అందువల్ల షుగర్ (పిండి పదార్థం) వెంటనే రక్తంలో చేరదు. అందువల్ల వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు. అందువల్ల జామకాయలు.డయాబెటిస్ ఉన్నవారికి ప్రకృతి ఇచ్చిన వరం అనుకోవచ్చు.

Kiwi : కాస్త రేటు ఎక్కువైనా పర్లేదనుకుంటే కివి పండ్లు చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి ఉంటుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్స్.మన శరీరంలో ఫ్రీరాడికల్స్ (విష వ్యర్థాలు, సూక్ష్మజీవులు)ని తరిమేస్తాయి. వీటిలో ఫుల్లుగా ఫైబర్ ఉంటుంది. అందువల్ల వింటర్‌లో కివీ తింటే మంచిదే.

Apples : యాపిల్స్‌లో ఫ్రక్టోజ్, యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన బాడీలో మెటబాలిజం (క్రమపద్ధతి)ని పెంచుతాయి. అందువల్ల రక్తంలో త్వరగా షుగర్ కలిసిపోదు. టైప్-2 డయాబెటిస్ రాకుండా యాపిల్స్ మేలు చేస్తున్నాయి. వీటిలోని ఆంథోసియానిన్ ఈ ప్రయోజనం కలిగిస్తోంది.

Pears : ఇవి కూడా రేటు ఎక్కువే. కానీ పియర్స్‌లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువ. పియర్స్‌ను ఉత్తివే తినడం మేలు. వాటిని జ్యూస్ చేసుకొని తాగడం కరెక్టు కాదు. ఎందుకంటే.జ్యూస్‌లా తాగితే. వెంటనే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. డయాబెటిస్‌ను సహజసిద్ధంగా కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే పియర్స్ తినవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :