Friday, November 20, 2020

Cylinder Booking on Paytm



Read also:

మీరు పేటీఎం యాప్‌లో బిల్ పేమెంట్ చేస్తుంటారా? పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

సిలిండర్ బుకింగ్‌లో పేటీఎం రికార్డులు సృష్టిస్తోంది. యూజర్లు గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి గతేడాది 'Book a Cylinder' సిలిండర్ పేరుతో పేటీఎం కొత్త సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం హెచ్‌పీ గ్యాస్, ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఇండేన్, భారత్ గ్యాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మూడు కంపెనీలకు చెందిన కస్టమర్లు ప్రస్తుతం పేటీఎంలో సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు. పేటీఎంలో 'Book a Cylinder' సర్వీస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సిలిండర్లు బుక్ అయ్యాయో తెలుసా? 50 లక్షలు. అవును... ఈ సర్వీస్ ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు 50 లక్షల బుకింగ్స్ దాటినట్టు పేటీఎం ప్రకటించింది. ఇందులో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రాసెస్ సింపుల్‌గా ఉన్నందువల్లే చాలామంది కస్టమర్లు మళ్లీ మళ్లీ సిలిండర్లు బుక్ చేస్తున్నారని పేటీఎం చెబుతోంది. మరి మీరు ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు అయితే సింపుల్‌గా గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

Cylinder Booking on Paytm: పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి ఇలా

  • ముందుగా మీ పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.
  • మీ వివరాలతో లాగిన్ అవండి.
  • ఆ తర్వాత ఫీచర్డ్‌లో Recharge and Pay Bills పైన క్లిక్ చేయండి.అందులో మీకు 'Book a Cylinder' ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీరు గ్యాస్ ప్రొవైడర్‌ను సెలెక్ట్ చేయాలి.
  • లిస్ట్‌లో Bharat Gas, HP Gas, Indane పేర్లు కనిపిస్తాయి.
  • మీరు ఏ గ్యాస్ ప్రొవైడర్ కస్టమర్ అయితే ఆ పేరు సెలెక్ట్ చేయండి.
  • ఆ తర్వాత సెలెక్ట్ బుకింగ్ టైప్‌లో 3 ఆప్షన్స్ ఉంటాయి.
  • కన్స్యూమర్ నెంబర్, డీలర్ కోడ్‌తో బుక్ చేయొచ్చు.
  • ఎల్‌పీజీ ఐడీతో బుక్ చేయొచ్చు. లేదా మొబైల్ నెంబర్‌తో బుక్ చేయొచ్చు.
  • మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా వివరాలు సరిగ్గా ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేస్తే కస్టమర్ వివరాలు కనిపిస్తాయి.
  • వివరాలు సరిచూసుకోవాలి.
  • అక్కడే మీరు ఎంత చెల్లించాలో కనిపిస్తుంది.
  • మీరు పేమెంట్ ప్రక్రియ పూర్తి చేయగానే బుకింగ్ ఐడీ కనిపిస్తుంది.
  • సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ నుంచి మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది.

డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ అయిన పేటీఎంలో మొబైల్ రీఛార్జ్, పోస్ట్‌పెయిడ్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, డీటీహెచ్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ లాంటి సేవలు అనేకం పొందొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :