Sunday, November 1, 2020

Covid 19 Rules for Students Teachers Parents



Read also:

పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో కోవిడ్ -19 కు సంబంధించి విద్యార్థులు పాటించవలసిన జాగ్రత్తలు

  • ఇంటి నుండి పాఠశాలకు బయలుదేరిన అప్పటి నుండి తిరిగి ఇంటికి చేరేవరకు ఎల్లప్పుడూ మాస్కు ధరించి ఉండాలి . 
  • మాస్క్ ముక్కు మరియు నోటిని కప్పివుంచేలా ధరించాలి . 
  • మాస్క్ ని ముందు వైపు చేతితో ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు . 
  • చేతులతో ముఖాన్ని తాకడాన్ని వీలైనంతవరకూ నివారించాలి. 
  • వెంట ఎప్పుడూ శానిటైజర్ ఉంచుకోవాలి , శానిటైజర్ ను సరైన రీతిలో ఉపయోగించడం గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి. 
  • పాఠశాల కు వెళ్ళినప్పుడు పాఠశాలలో తోటి విద్యార్థుల నుండి ఆరడుగుల కనీస దూరాన్ని పాటించాలి . 
  •  పుస్తకాలు పెన్నులు ఇంకా ఏ ఇతర వస్తువులను తోటి విద్యార్థులకు ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు . 
  • కలసి ఆడుకునే ఆటలకు దూరంగా X ఉండాలి , బదులుగా వ్యాయామం చేయవచ్చు . 
  • మరుగుదొడ్డి కి వెళ్లే ముందు వెళ్లిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి . శానిటైజర్ తో 20 సెకన్లపాటు చేతులను శుభ్రం చేసుకోవాలి . 
  • తరగతి గదిలో తమకు నిర్దేశించిన స్థలము నుండి మారకూడదు .
  • భోజన సమయంలో కూడా భౌతిక దూరాన్ని పొటించాలి మంచినీళ్లు ఆహారపదార్థాలను ఒకరితో ఒకరు పంచుకోవడం.
  • భోజనం వ్యర్థాలను ఇతర అంశాలను జాగ్రత్తగా నిర్దేశించిన చెత్త కుండీలలో వేయాలి పరిసరాలను పరిశుభ్రం చేయకూడదు .
  • తమకు గాని ఇతర కుటుంబ సభ్యులకు , తనకు సన్నిహితంగా ఉండే ఇతర వ్యక్తులకు కానీ కోవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లయితే పాఠశాలకు హాజరుకాకూడదు .
  • పాఠశాలకు వచ్చిన తర్వాత ఏవైనా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే తరగతి ఉపాధ్యాయునికి తెలియపరచి , ఇంటికి వెళ్ళాలి. 
  • తమ తోటి విద్యార్థులలో కోవిడ్ - 19 లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే ఉపాధ్యాయులకు తెలియపరచాలి . 
  • కోవిడ్ 19 లక్షణాలు , సోకకుండా తీసుకోవలసిన తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలి . వీటి గురించి తమ కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి.

Time table

ఉపాధ్యాయులు పాటించవలసిన జాగ్రత్తలు

విధ్యార్డులు పాటించవలసిన జాగ్రత్తలు

తల్లితండ్రులు పాటించవలసిన జాగ్రత్తలు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :