Sunday, November 29, 2020

Child Aadhaar card



Read also:

Child Aadhaar card | ఆధార్ కార్డు. పుట్టిన పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకు అందరికీ ముఖ్యం అయిపోయిన డాక్యుమెంట్ ఇది. మరి మీ పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

1. మీ పిల్లలకు ఆధార్ కార్డు ఉందా? ఇంకా తీసుకోలేదా? ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ ప్రతీ చోట అవసరం అవుతోంది. బ్యాంకు అకౌంట్ దగ్గర్నుంచి ప్రభుత్వ స్కీమ్‌ల వరకు చాలా చోట్ల ఆధార్ అవసరం. పెద్దలకే కాదు. పిల్లలు కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే.

2. పిల్లలకు తల్లిదండ్రులు ఆధార్ కార్డు తీసుకునేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI సేవలు అందిస్తోంది. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఆధార్ కార్డు తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి. 

3. మీ పిల్లల వయస్సు ఐదేళ్ల లోపు అయితే తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల్ని తీసుకొని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. తల్లి లేదా తండ్రి తమ ఆధార్ కార్డును చూపించాలి. ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ పూర్తి చేసి, పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డ్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది.

4. ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని వెరిఫికేషన్ కోసం తీసుకెళ్లాలి. పిల్లల ఫోటో మాత్రమే చాలు. బయోమెట్రిక్స్ తీసుకోరు. మీ పిల్లల వయస్సు 5 ఏళ్లు దాటిన తర్వాత 15 ఏళ్ల లోపు ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ స్కాన్, ఫేషియల్ స్కాన్ చేయించాలి.

5. మీ పిల్లల వయస్సు 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటే ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌తో పాటు స్కూల్ ఐడీ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్ కాపీ జత చేయాలి. అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. పిల్లలకు స్కూల్ ఐడీ కార్డు లేకపోతే తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు కాపీ జత చేయాలి.

6. ఇక మీ పిల్లల వయస్సు 15 ఏళ్లు దాటిన తర్వాత కొత్త ఆధార్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. పిల్లలకు ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ కొన్ని సేవల్ని ఉచితంగా అందిస్తోంది.

7. పిల్లలకు ఐదేళ్ల వయస్సులోపు ఆధార్ కార్డు తీసుకున్నవారంతా తమ పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత ఖచ్చితంగా వివరాలు అప్‌డేట్ చేయించాల్సిందే. చాలామందికి ఈ విషయాలు తెలియక. ఆధార్ కార్డు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు.

8. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు జారీ చేస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డ్ బ్లూ కలర్‌లో ఉంటుంది. దాన్ని చైల్డ్ ఆధార్ లేదా బాల్ ఆధార్ అంటారు. పిల్లల వయస్సు ఐదేళ్లు దాటిన తర్వాత ఆ ఆధార్ కార్డు చెల్లదు.

9. తల్లిదండ్రులు మళ్లీ తమ పిల్లల్ని ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లి బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయించాలి. మీ పిల్లలకు మొదటిసారి ఆధార్ కార్డు తీసుకునేప్పుడు బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. చైల్డ్ ఆధార్‌ను పిల్లల తల్లిదండ్రులకు లింక్ చేస్తారు. ఐదేళ్లలోపు బయోమెట్రిక్ వివరాలేవీ తీసుకోరు. 

10. వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కన్ఫర్మేషన్ మెసేజ్ తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. రిజిస్టర్డ్ అడ్రస్‌కు 60 రోజుల్లో ఆధార్ కార్డ్ వస్తుంది. ఇక పిల్లల వయస్సు ఐదేళ్లు దాటినప్పుడు బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయించాల్సి ఉంటుంది.

11. ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ సెంటర్‌కు వెళ్లి తల్లిదండ్రుల వివరాలతో పాటు పిల్లల వివరాలతో ఫామ్‌ పూర్తి చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. పిల్లల వేలిముద్రలు, ఐరిస్ లాంటి అప్‌డేట్ చేసి కొత్త ఆధార్ కార్డ్ జారీ చేస్తారు. కొత్త ఆధార్ కార్డు 90 రోజుల్లో రిజిస్టర్డ్ అడ్రస్‌కు వస్తుంది.

12. పిల్లల వయస్సు ఐదేళ్లు దాటగానే బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేస్తే సరిపోదు. మళ్లీ వాళ్ల వయస్సు 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా బయోమెట్రిక్ డీటెయిల్స్ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. పిల్లల బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయడానికి యూఐడీఏఐ ఎలాంటి ఛార్జీలను వసూలు చేయదు. తల్లిదండ్రులు తమ పిల్లల వివరాలను ఉచితంగానే అప్‌డేట్ చేయొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :