Friday, November 6, 2020

Check for your whatsapp storage



Read also:

వాట్సప్‌లో వచ్చే ఫోటోలు, ఫైల్స్, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ కావడం ఒక్కరి సమస్య కాదు. అయితే కొన్ని సెట్టింగ్స్ మారిస్తే స్టోరేజ్ అంత తొందరగా ఫుల్ కాకుండా జాగ్రత్తపడొచ్చు. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి

1. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఉపయోగిస్తున్నారా? వాట్సప్‌లో వచ్చే ఫోటోలు, వీడియోలతో మీ ఫోన్ స్టోరేజీ ఫుల్ అయిపోయిందా? ఇతర యాప్స్ ఇన్‌స్టాల్ చేయడానికి స్పేస్ సరిపోవట్లేదా? ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. వాట్సప్ ఉపయోగిస్తున్న వారందరికీ దాదాపు ఈ సమస్య సాధారణమే. 

2. వాట్సప్‌లో ఫైల్స్ డౌన్‌లోడ్, మేనేజ్‌మెంట్ సరిగ్గా చేస్తే స్టోరేజ్ సమస్య వీలైనంతవరకు తగ్గించొచ్చు. ఇందుకోసం మీరు కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఆటో డౌన్‌లోడ్ నిలిపివేయడం, బ్యాకప్‌ని మెయింటైన్ చేయడం లాంటి టిప్స్‌తో స్టోరేజ్ చాలావరకు ఖాళీ చేయొచ్చు. 

3. ఇందుకోసం మీరు సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి. వాట్సప్‌లో ఆటో డౌన్‌లోడ్స్ నిలిపివేసేందుకు ఈ టిప్స్ ఫాలో అవండి. ముందుగా వాట్సప్ ఓపెన్ చేయండి. రైట్ టాప్ కార్నర్‌లో త్రీడాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ పైన క్లిక్ చేయండి. 

4. మీడియా ఆటో డౌన్‌లోడ్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మొబైల్ డేటా, రెండోది వైఫైకి కనెక్ట్ చేసినప్పుడు, మూడోది రోమింగ్ అని ఉంటుంది. ప్రతీ దాంట్లో ఫోటోస్, ఆడియోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ బాక్సుల్ని అన్‌చెక్ చేయండి. ఆ తర్వాత ఓకే సెలెక్ట్ చేయండి.

5. ఇక మీ వాట్సప్ డేటాను తక్కువగా ఉపయోగించేందుకు ఈ టిప్స్ ఫాలో అవండి. వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో డేటా అండ్ స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. కాల్ సెట్టింగ్స్‌లో Low data usage ఆప్షన్ ఎనేబుల్ చేయండి. దీని వల్ల కాల్ సమయంలో డేటా తక్కువగా ఖర్చవుతుంది. మీకు స్టోరేజ్ ఎక్కువగా ఎందుకు ఫుల్ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు.

6. ఇందుకోసం వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత డేటా అండ్ స్టోరేజ్‌పైన క్లిక్ చేసి Storage usage పైన క్లిక్ చేయండి. ఏ ఛాటింగ్స్ వల్ల స్టోరేజ్ ఫుల్ అవుతుందో తెలుస్తుంది. ఆ ఛాట్‌లోకి వెళ్లి ఫైల్స్ డిలిట్ చేయొచ్చు. ఎక్కువగా వాట్సప్ గ్రూప్స్‌లో వచ్చే ఫైల్స్ వల్ల స్టోరేజ్ ఫుల్ల అవుతూ ఉంటుంది.

7. మీ ఛాట్స్‌ని బ్యాకప్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఛాట్స్ ఓపెన్ చేయండి. ఛాట్ బ్యాకప్ పైన క్లిక్ చేయండి. వైఫై ద్వారానే బ్యాకప్ చేస్తే మొబైల్ డేటా మిగులుతుంది. ఒకవేళ మీకు మొబైల్ డేటా ఎక్కువగా ఉంటే మొబైల్ డేటా ద్వారా బ్యాకప్ చేయొచ్చు.

8. మీరు గూగుల్ ఫోటోస్ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే అందులోకి కూడా మీ వాట్సప్ ఫైల్స్ బ్యాకప్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేయండి. అందులో లైబ్రరీ సెక్షన్ క్లిక్ చేయండి. ఫోటోస్ ఆన్ డివైజ్ క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. 

9. అందులో వాట్సప్ ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. మీ ఫోటోస్, వీడియోస్ అప్‌లోడ్ అయిన తర్వాత ఫోన్‌లో ఆ ఫైల్స్ డిలిట్ చేయొచ్చు. అయితే ముఖ్యమైన ఫైల్స్ మాత్రమే గూగుల్ ఫోటోస్‌లోకి అప్‌లోడ్ చేయండి. ఫోటోస్‌లో మీ ఫైల్స్ అప్‌లోడ్ చేయడానికి స్టోరేజ్ లిమిట్ ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :