Saturday, November 28, 2020

BPCL



Read also:

 భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(BPCL)ను ప్రయివేటీకరణ చేయనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా బీపీసీఎల్ వాటాలను విక్రయించనుంది. BPCLను ప్రయివేటీకరిస్తే వంటగ్యాస్ సబ్సిడీ కొనసాగుతుందా అనే ఆందోళన చాలామందిలో ఉంది. దీనిపై చమురు మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం స్పష్టతనిచ్చారు. బీపీసీఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు.BPCLను ప్రయివేటీకరించినప్పటికీ వంట గ్యాస్ పైన సబ్సిడీ కొనసాగుతుందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

వంట గ్యాస్ రాయితీ నేరుగా వినియోగదారులకే బదలీ చేస్తున్నామని, మధ్యలో ఏ కంపెనీలు ఉండవని స్పష్టం చేశారు. కాబట్టి చమురు రంగ సంస్థ ప్రభుత్వానిదా, ప్రయివేటుదా అనేది అనవసరమన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత కూడా BPCL కస్టమర్లకు ఎల్పీజీ సబ్సిడీ కొనసాగుతుందన్నారు.

గృహ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల వంట గ్యాస్ పైన రాయితీ కల్పిస్తుంది. కస్టమర్లు సంవత్సరానికి 12 సిలిండర్లు రాయితీతో కొనుగోలు చేయవచ్చు. అంతకంటే ఎక్కువ కావాలంటే మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలి. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం నేరుగా కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లోకి బదలీ చేస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, బీపీసీఎల్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ సంస్థలపై రాయితీ అందుతోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :