Saturday, November 21, 2020

పాఠశాలలు పున:ప్రారంభం-మార్గదర్శకాలు



Read also:

➤ప్రాథమికోన్నత పాఠశాలల  ఉపాధ్యాయులు మరియు-పేరెంట్ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు చర్చించుకుని సదరు  పాఠశాల స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్(పాఠశాల పున: ప్రారంభించేందుకు ముఖ్య మార్గదర్శకాలు) SOP, తయారు చేసుకోవాలి.

➤పాఠశాలలో ప్రారంభానికి ముందు పాటించవలసిన ఆరోగ్య పర్యవేక్షణ పరిశుభ్రత మరియు ప్రామాణిక కార్యాచరణ విధివిధానాలు చర్చించాలి.

➤covid-19 సంబంధించిన జాగ్రత్తలు శారీరక /సామాజిక దూరం covid 19గురించి మొదలైన వాటిపై పోస్టర్లు సిద్ధం చేయాలి.

➤తల్లిదండ్రులు వ్రాతపూర్వక అనుమతి తో పిల్లలను పాఠశాలకు అనుమతించాలి.

➤పాఠశాలలో సరైన శుభ్రత మరియు పారిశుద్ధ్యం సౌకర్యాలు ఉండేలా చూడడం,ఫర్నిచర్ వంటశాలలు, తరగతి గదులు శుభ్రంగా ఉంచడం మరియు చేతులు కడుక్కోవటానికి సౌకర్యాలు ఉండేలా  చూడడం.

➤విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి టాస్క్ ఫోర్స్ టీములు ఏర్పాటు చేయడం, సమస్యలను గుర్తించడం.

➤విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని covid 19 నిబంధనలు పాటిస్తూ సీటింగ్ ప్రణాళిక చేయడం.

➤తరగతి గది లో ఇతర ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను నిర్ధారించడం.

➤covid-19 జాగ్రత్తలు సూచనలు పాటించడం విద్యార్థులకు అవగాహన పరచడం.

➤మధ్యాహ్న భోజన పంపిణీ సమయంలో భౌతిక మరియు సామాజిక దూరం పాటిస్తూ అమలు చేయాలి.

➤మధ్యాహ్న భోజనం గుర్తించుటకు ప్రామాణిక నిర్వహణా పద్ధతులు(SOPs) పాటించాలి.

➤భాగస్వాములను పాల్గొనేటట్లు చేయుట, పేరెంట్స్ కమిటీ సభ్యులు, చురుకైన తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, టీచర్లు పాల్గొనేటట్లు చేయుట.

➤తాగునీటి సరఫరా/ వ్యర్థాల నిర్వహణ తదితర సమస్యలపై దృష్టి సారించాలి.

➤అమ్మ ఒడి ద్వారా సేకరించిన అమౌంట్ తో పాఠశాల పారిశుద్ధ్య కార్మికురాలు ద్వారా ఎప్పటికప్పుడు పాఠశాల ఆవరణను తరగతి గదులను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం.

➤పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు తప్పకుండా చెల్లించుట నిర్ణయాలు తీసుకోవడం.

➤ప్రతి పాఠశాల యందు covid-19 సంబంధించిన ఫ్లెక్సీ, మరియు పోస్టర్లు,శానిటైజర్ ధర్మ ల్ స్క్రీనర్ లు, ఉండేలా చూడడం.

➤విద్యార్ధి,ఉపాధ్యాయులు పాఠశాలలో చేరి ఇతర వ్యక్తులు మాస్కు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవడం.

➤ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు covid 19 పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను, మార్గదర్శకాలను పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :