Monday, November 23, 2020

మనబడి : నాడు-నేడు ముఖ్యసూచనలు



Read also:

1. మీకు మంజూరైన 4 కాంపోనెంట్ లను వీలైనంత త్వరలో ఖచ్చితంగా పూర్తిచేయుటకు ప్రయత్నించాలి.

2. 4 కాంపోనెంట్ లలో మంజూరైన నిధుల మేరకు మాత్రమే పనులకైన ఖర్చుచేసి పనులు పూర్తిచేయాలి. బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుండాలి.

3. ఇటీవల   కొన్ని పాఠశాలలకు AE గారి ద్వారా అదనపు నిధులు మంజూరు అయ్యాయి. అలా మంజూరైన వారు దానిని ఉపయోగించుకోవచ్చు. (ఇపుడు కొత్తగా అదనపు ప్రతిపాదనలకు నిధులు మంజూరు కావు)

4.  4 కాంపోనెంట్ లలో మంజూరైన నిధుల కు పైబడి ఖర్చులు చేయరాదు.(అన్ని పనులు పూర్తయ్యాక మాత్రమే, నిధులు ఉంటే చివరలో AE గారి ద్వారా ఖర్చు చేయవచ్చు.)

5. కొన్ని పాఠశాలలకు 4 కాంపోనెంట్ లలో మంజూరైన నిధులకంటే అదనపు నిధులు వచ్చిఉంటే, ఆ నిధులు Central Procurement Material కొరకు జమచేశారు. గమనించ గలరు. వీటిని వాడరాదు.

6.Paintings : సంబంధించి Berger Company వారే paintings వేస్తారు. అవసరమైతే గోడలను కంపెనీవారే శుభ్రం చేస్తారు.* (హెచ్.ఎమ్. లు గోడలకు క్లినింగ్ చేయించనవసరంలేదు)Berger company వారే పేయింటింగ్స్ వేశాక గోడలను నీటితో 2సార్లు శుభ్రం చేయాలి.

7.  గోడలు పాతవిగాఉండి, గరుకులుఉంటే అవి పూడ్చి, నున్నగా చేయవసిన అవసరం ఉన్నచోట మాత్రమే వాల్ పుట్టి కొద్దిమేరలో కంపెనీవారు వేస్తారు.గోడలు అన్ని వాల్ పుట్టి వేయించుకోవాలి అనుకుంటే, నిధులు ఉన్నవారు  వేయించుకోవచ్చు. ఈ ఖర్చులను బెర్జర్ కంపెనీ భరించదు. ఇతర నిధులతో Berger company పెయింగ్స్ కొనాల్సివుంటుంది.

8. Berger company వారు 2 లేదా 3 కోటింగ్ లు ప్రైమరీ పేయింటింగ్స్ వేశాక, ప్రభుత్వం సూచించిన డిజైన్ లను ఎంపిక చేసుకొని, అందుకయ్యే ఖర్చును కంపెనీవారికి తెలిపితే వారు పెయింట్స్ సరఫరా చేస్తారు.(డ్రాయింగ్ డిజైన్ ల కొరకు హెచ్.ఎమ్. లు ఇంజనీర్ల సహకారం తో కొలతలు సేకరించి కంపెనీకి తెలపాలి. పేయింటింగ్స్ కొరకు అదనంగా కొనాల్సిన అవసరం లేదు)

9. టైల్స్ : ప్రభుత్వం సూచించిన కంపెనీలకు చెందిన టైల్స్ ను ఏ షాపు నుండైనా కమిటీ తీర్మానం మేరకుకొనచ్చు.

10. Central Procurement Material కాకుండా మిగిలిన అన్ని పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలి.

11. ఇసుక, సిమెంటు కావలసినవారు లోకల్ గానే కమిటీ తీర్మానం మేరకు కొనుక్కోవాలి. బిల్లులను యాప్ లో అప్లోడ్ చేయాలి.

👉 గమనిక : Central Procurement Material రాకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ కాంపోనెంట్ ను Close చేయరాదు.అలా పొరపాటున చేసినా నిధులు రావు. గమనించగలరు.

👉ఆన్నీ పనులు పూర్తయ్యాక మిగిలిన నిధులను అకౌంటులో జమచేస్తారు. అపుడు ఇంకా ఏవైనా అవసరమైన పనులు గుర్తిస్తే, కమిటీ తీర్మానం మేరకు చివరలో ఖర్చు చేయవచ్చు.

అకౌంటులో నిధులు ఉన్నవారు ఈ నెలాఖరులోగా లేదా డిశంబరు నెలలో ఖచ్చితంగా పూర్తిచేయుటకు ప్రయత్నించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :