Sunday, November 22, 2020

ఉద్యోగులకు కేంద్రం ఝలక్



Read also:

డీఏ పెంపు నిలిపివేత-కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. డీఏ పెంపును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రియల్ డియర్ నెస్ అలవెన్స్ (ఐడీఏ) చెల్లింపు మార్గదర్శ కాల ప్రకారం.. 2020, అక్టోబర్ 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఉద్యోగుల డీఏను చెల్లింపును నిలిపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందనిసెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రై జెస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ.. 2017, 2007, 1997, 1992, 1987 ఐడీఏ చెల్లింపు సంస్కరణల మార్గదర్శకాల ప్రకారం చెల్లించబడుతుందని, 01.10.2020 ప్రకారం చెల్లించబడదని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి మార్చి నుంచి చెల్లించాల్సిన డీఏ అదనపు వాయిదాలను కూడా చెల్లించబడవని స్పష్టం చేసింది. జులై నుంచి అమల్లోకి వచ్చే ప్రస్తుత రేట్ల ప్రకారం చెల్లించబ డుతుందని వివరించింది. ప్రస్తుత రేట్ల వద్ద డీఏ... (జులై 1, 2020 నుంచి అమల్లోకి వస్తుంది) చెల్లిచబడుతుందని డీపీఈ సర్క్యూలర్ ద్వారా తెలిపింది. జులై 1, 2020 నుంచి డీఏ ఫ్యూచర్ ఇన్స్టాల్ మెంట్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు.. డీఏ రేట్లు, అక్టోబర్ 1, 2020, జనవరి 1, 2021, ఏప్రిల్ 1 2021 నుంచి అమల్లోకి వస్తాయి. డీపీఈ సర్క్యూలర్ ప్రకారం.. 2020, అక్టోబర్ నుంచి 2021, జూన్ 30 వరకు ఏరియర్స్ కూడా చెల్లించబడవని స్పష్టమైంది కోవిడ్ - 19 సంక్షోభం కారణంగా.. జులై 2021 వరకు సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్ల డీఏ పెంచాలని ఏప్రిల్ లోనే ఆర్థిక మంత్రిత్వ నిర్ణయించిన విషయం తెలిసిందే.


Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :