Wednesday, November 11, 2020

టపాసుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం



Read also:

కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగంకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగులు దూరం పాటించాలని సూచించింది.దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :