Monday, November 23, 2020

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్



Read also:

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సర్కారు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారు సదరు గ్రామ పరిధిలో, అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది మున్సిపాలిటీ లేదా కార్పోరేషన్ పరిధిలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనలు అమలు అవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు డివిజనల్‌, మండల స్ధాయి అధికారులు సదరు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలి. ఉద్యోగులు అక్కడే నివాసం ఉంటున్నారో లేదా అనే అంశాన్ని తరచుగా పరిశీలించాలని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు సంక్షేమ పథకాలు ప్రజలకు వందశాతం అందడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ సిటీల్లో ఉంటున్న ఉద్యోగులకు షాక్ తగలనుంది.

గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలు అందించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. ఏపీలో గ్రామ స్వరాజ్యం, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించించి. ప్రతీ సచివాలయంలో 12 మంది ఉద్యోగులను నియమించింది. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలాయలకు వెళితే చాలు ఏ పనైనా జరుగుతుందన్న భరోసా ఇచ్చింది. కానీ రాష్ట్రంలోని పలు చోట్ల ఉద్యోగులు పని చేసే చోట నివాసం ఉండకపోవడంతో ఈ లక్ష్యం నీరుగారుతోంది.

మరోవైపు సచివాలయం నిర్మాణం కోసం పంచాయతీ భవనం కూల్చడం వివాదాస్పదం అయింది. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని తోలుకోడు గ్రామంలో పంచాయతీ కార్యాలయం కూల్చివేత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఎటువంటి లోపం లేకుండానే గ్రామ సచివాలయ నిర్మాణం కోసం పటిష్టంగా ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని కూల్చివేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శిథిలంగా ఉన్న సొసైటీ భవనాన్ని వదిలేసి చక్కగా ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని కూల్చడాన్ని వారు తప్పుపడుతున్నారు. దీంట్లో గ్రామ వైసీపీ నేతలు, కాంట్రాక్టర్ల మీద మండిపడుతున్నారు. గ్రామ వైసీపీ నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వారికి లబ్ధి చేకూర్చడం కోసం పంచాయతీ భవనాన్ని కూల్చి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :