Thursday, November 12, 2020

నేటి నుంచి ఆన్‌లైన్‌లో బదిలీల నమోదుకు అవకాశం



Read also:

★ ఉపాధ్యాయ బదిలీలకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది.

★ అడ్‌హక్‌ పదోన్నతుల ప్రక్రియతో మొదలై ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చర్యకు చేరుకుంది.

★ ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం కల్పించనున్నారు. 

★ ఒక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తూ ఎనిమిది సంవత్సరాల సర్వీస్‌ పూర్తయిన ఉపాధ్యాయులు, అయిదేళ్లు సర్వీస్‌ పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, 

★ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్‌ప్లస్‌ అయిన పోస్టులలో ఉన్న ఉపాధ్యాయులు బదిలీలకు నమోదు చేసుకోవాల్సి ఉంది.

★ రెండేళ్ల సర్వీస్‌ ఒకే పాఠశాలలో పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులూ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్ఛు

★ విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులు, అవసరమైన ఉపాధ్యాయులను గుర్తించిన అనంతరం సర్దుబాటు చేయగా, మిగిలిన ఖాళీలను ఆన్‌లైన్‌లో ప్రదర్శించనున్నారు.

★ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ తరువాత ఈ నెల 12 (ఈరోజు) నుంచి 16వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో బదిలీలకు ఉపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :