Friday, November 20, 2020

ఆధార్‌లో ఏదైనా సమస్య ఉందా ఈ నెంబర్‌కు ఓ కాల్ చేయండి చాలు



Read also:

మీ ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నాయా? మీ ఆధార్ కార్డుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? ప్రతీ చిన్న పనికి ఆధార్ సెంటర్‌కు వెళ్లలేకపోతున్నారా? ఏం పర్లేదు. మీరు ఆధార్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్ 1947 లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు హోల్డర్లు తమ సమస్యలపై ఈ నెంబర్‌కు కాల్ చేయొచ్చు. యూఐడీఏఐ ప్రతినిధితో మాట్లాడొచ్చు. మీ ఆధార్ నెంబర్ చెప్పి మీ సమస్యను వివరించొచ్చు. యూఐడీఏఐ ప్రతినిధి మీ సందేహాలకు సమాధానాలను, సమస్యలకు పరిష్కారాలను వివరిస్తారు. ఆ తర్వాత మీరు ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చు. 1947 నెంబర్‌కు ఉచితంగా కాల్ చేయొచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు.

రోజూ లక్షన్నర కాల్స్ స్వీకరించే కెపాసిటీ ఉంది యూఐడీఏఐ కాల్ సెంటర్‌కు. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి యూఐడీఏఐ హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేయాలి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాల్ చేయొచ్చు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ సెంటర్ పనిచేస్తుంది. ఐవీఆర్ఎస్ సిస్టమ్ మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మీ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేయొచ్చు. మీకు దగ్గర్లోని ఆధార్ సెంటర్ వివరాలు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్టేటస్, ఆధార్ కార్డు డెలివరీ స్టేటస్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు.

మీ ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యల్ని emailhelp@uidai.gov.in మెయిల్ ఐడీకి మెయిల్ చేసి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments
nandu
AUTHOR
November 26, 2020 at 1:38 PM delete

how can i link my mobile number to my aadhar card online? is there any possibility other than visiting aadhar center

Reply
avatar