Thursday, November 19, 2020

క్రెడిట్ కార్డుదారులకు 'సుప్రీం' షాక్



Read also:

క్రెడిట్ కార్డు ఉయోగిస్తున్న వారికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. క్రెడిట్ కార్డు వాడే వారికి.లోన్ మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ ప్రయోజనం అవసరం లేదని అభిప్రాయపడింది. కార్డు వినియోగదారులకు ఇది షాకింగేనని చెప్పవచ్చు.

కరోనా నేపధ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... ప్రజల ఆదాయం భారీగా తగ్గిపోయింది. కొంత మంది ఉపాధి కోల్పోయారు కూడా. ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం ప్రయోజనాన్ని అందుబాటులోకి సుకువచ్చింది.

పర్సనల్ లోన్ మొదలుకుని క్రెడిట్ కార్డుల వరకు ఈ లోన్ మారటోరియం వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది.

బ్యాంకులు కూడా వారి ఖాతాదారులకు ఈ ప్రయోజనాన్నందించాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ.అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు లోన్ మారటోరియం అంశంపై సుప్రీం కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. వడ్డీ మీద వడ్డీ మాఫీకి కేంద్రం సుముఖంగా ఉన్నా కూడా ఆర్‌బీఐ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థపై, మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటోంది.

సుప్రీం కోర్టులో గురువారం కూడా ఈ అంశంపై వాదనలు జరిగాయి. ఈ క్రమంలో.సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం అందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు మింగుడుపడని వార్తేనని చెప్పుకోవచ్చు. 'క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణ గ్రహీతల కిందకు రారు' అని సుప్రీం కోర్టు పేర్కొంది. క్రెడిట్ కార్డు వినియోగదారులు రుణాలను పొందలేదని, కొనుగోళ్ళు మాత్రమే చేశారని స్పష్టం చేసింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :