Monday, November 16, 2020

పరగడుపున "టీ" తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్



Read also:

Tea Side Effeects :ప్రతి రోజూ ఉదయం పరగడుపున టీ తాగడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. వీటి గురించి తెలుసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పరగడుపున టీ తాగడం వల్ల పొందే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.

  • ప్రతి రోజు ఉదయం పరగడపున బ్లాక్ టీ తాగడం వలన కడుపుబ్బరంగా అనిపిస్తుంది. దాంతో అసౌకర్యంగా ఉంటుంది. రోజంతా చురుకుదనం లోపిస్తుంది.
  • ప్రతి రోజూ పరగడపున టీ తాగడం వల్ల పొట్టలో గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దాంతో ఆకలి మందగిస్తుంది.
  • టీ అసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది . కాబట్టి, పరగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటికి కారణమవుతుంది.
  • టీలో ఉండే టానిన్స్ రోజంతా వాంతి అయ్యేట్లు ఫీలింగ్ కలిగిస్తుంది.
  • పరగడుపున టీ తాగడం వల్ల వాంతులు వికారంగా అనిపిస్తుంది.
  • మిల్క్ టీ తాగడం వల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది. అలాగే తరచూ మూడ్ మారుతుంటుంది.
  • ప్రతి రోజూ చాలా స్ట్రాంగ్ టీ తాగే వారిలో అల్సర్ కు దారితీస్తుంది. స్టొమక్ అల్సర్ కారణమవుతుంది.
  • ప్రతి రోజూ ఉదయం జింజర్ టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి
  • టీలో కెఫిన్, ఎల్ థైనిన్స్ మరియు థయోఫిలైన్ అధికంగా ఉండటం వల్ల అజీర్తికి కారణమవుతుంది.
  • టీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. 5 నుండి 8 కప్పుల టీ తాగే వారిలో దీర్ఘ కాలంలో నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది.
  • టీ ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు డ్యామేజ్ అవుతాయి .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :