Friday, November 20, 2020

రాత్రిపూట సెల్‌ఫోన్ వాడుతున్నారాఅయితే ఇది మీ కోసమే



Read also:

ప్రస్తుత సమాజంలో అందరు ఫోన్ కి చాల అట్ట్రాక్ట్ అయ్యారు. అయితే రాత్రిపూట ఫోన్ ని ఎక్కువ సేపు చూస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే. రాత్రిపూట ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటం వల్ల వాటి నుండి నీలిరంగు కాంతి విడుదలై అది టైప్-2 డయాబెటిస్ కు దారితీస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. అంతేకాక, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే నీలిరంగు కాంతికి గురవ్వడం వల్ల వ్యక్తి ఆకలి పెరగడమే కాకుండా అతని జీవక్రియ మెరుగవుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది.

చాల మంది ఉద్యోగంలో భాగంగా కొందరు నైట్ డ్యూటీలు చేస్తుంటారు. నైట్ డ్యూటీల వల్ల వారి ఆరోగ్యానికి ముప్పేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నైట్ డ్యూటీ వల్ల ప్రాణంతకమైన గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వారు వెల్లడిస్తున్నారు. వారంలో ఎవరైతే ఎక్కువ రోజులు నైట్ డ్యూటీలు చేయడం, తరచూ షిఫ్ట్లు మారుతుంటారో వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు.

ఇక అధ్యయనంలో భాగంగా 19 మంది ఆరోగ్యవంతులపై నాలుగు రోజుల పాటు వివిధ కాంతి పరిస్థితులలో శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.అయితే రాత్రి పూట ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలను వాడిన వారిలో గ్లూకోజ్, ఇన్సులిన్, కార్టిసాల్, లెప్టిన్, గ్రెలిన్ స్థాయిలను పరిశీలించారు. మసక కాంతితో పోలిస్తే నీలిరంగు కాంతిలో ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ పరికరాలను వాడిన వారిలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా పెరిగాయని ఈ పరిశోధనలో వెల్లడించారు.

ఈ సందర్బంగా అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్ ఐవీ చెయుంగ్ మాసన్ మాట్లాడుతూ'కాంతి బహిర్గతం అయ్యే రాత్రి సమయంలో బ్లూ లైట్ కింద పనిచేసే వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీవ్రంగా ప్రభావితం అవుతుందని తెలిపారు. ఈ విషయం వారి ప్రాథమిక పరిశోధనలో తేలిందన్నారు. రాత్రి పూట కాంతి బహిర్గతం నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. దీని వల్ల శరీరం ఎక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఇది ఆకలి, అధిక రక్తపోటు, బరువు పెరగడానికి దారితీస్తుంది.'' అని ఆయన పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :