Tuesday, November 24, 2020

స్పోర్ట్స్ కోటా జీవోకు సవరణలు: క్రీడాశాఖ ఉత్తర్వులు



Read also:

ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా రిజర్వే షకు సంబంధించిన జీవో-74కు ప్రభుత్వం 3 సవరణలు చేసింది. ఈ మేరకు క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి కె.రాంగోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. టీం ఈవెట్స్, వ్యక్తిగత ఈవెంట్స్ లో పాల్గొనే వారికి స్పోర్ట్స్ కోటాలో ప్రాధాన్యం ఇచ్చేవా రు. అయితే, ఈ విషయంలో కొన్ని సార్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు ఆరోపణ లు ఉన్నాయి. ఇకపై ఇలా జరగకుండా జీవో-74కు సవరణలు చేశారు. ఇద్దరు అభ్య ర్థులు ఒకే రకమైన అర్హత కలిగి ఉన్న నేపథ్యంలో వారికి అర్హత పరీక్షల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ను సిద్ధం చేస్తారు. జాతీయ క్రీడల్లో పాల్గొని, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించిన వారికి ఇప్పటి వరకూ ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. తాజాగా రాష్ట్రస్థాయి క్రీడాల్లో పాల్గొన్న వారికి కూడా ఈ అర్హత కల్పిం చింది. ఉద్యోగానికి ఎంపికైన ఐదేళ్ల పాటు ఆడాలని, లేదంటే ఆ క్రీడాకారులకు వచ్చిన సర్టిఫికెట్లు పదేళ్లలోపువై ఉండాలని సవరణ చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :