Tuesday, November 3, 2020

ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పోలీస్ ఉద్యోగ శిక్షణ



Read also:

ఇంటర్ చదువుతూ.. భవిష్యత్ లో పోలీస్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతూ.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇటీవల పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పోస్టుల సంఖ్య అధికంగా ఉంటుండడంతో అనేక మంది అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది అభ్యర్థులు కోచింగ్ కోసం పట్టణాలు, నగరాలకు వస్తున్నారు. ఇక్కడ హాస్టళ్లలో ఉంటూ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. ఇందు కోసం వేల రూపాయలను వారు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతూ.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఇంటర్ విద్యాబోధనతో పోలీసు ఉద్యోగ నియామక పరీక్షకు అవసరమైన అంశాల్లో కోచింగ్ ఇవ్వనున్నారు. పోలీసుశాఖతో ఇంటర్ బోర్డు ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

జనరల్‌ నాలెడ్జ్, రీజనింగ్, ఇతర సబ్జెక్టులతో పాటు రన్నింగ్, జంపింగ్‌, పోలీసు ఉద్యోగం సాధించడానికి అవసరమైన ఇతర అంశాలపై సైతం శిక్షణ ఇవ్వనున్నారు. ఇందు కోసం హైదరాబాద్ నగరంలోని ఏడు ఇంటర్ కళాశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు శిక్షణ కోసం ఎంపిక చేసిన కళాశాలలను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉద్యోగం సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తే వారు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

శిక్షణ కోసం ఎంపిక చేసిన కళాశాలలు ఇవే..

1. గన్‌ఫౌండ్రీ అలియా ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్

2. ప్రభుత్వ మహబూబియా బాలికల కళాశాల

3. మలక్‌పేట్‌ న్యూ జూనియర్‌ కాలేజ్

4. నాంపల్లి ఎంఏఎం జూనియర్‌ కాలేజ్5. కాచిగూడ ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్

6. ఫలక్‌నుమా బోయ్స్‌ జూనియర్‌ కాలేజ్

7. మారేడ్‌పల్లి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజ్

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :