Friday, November 20, 2020

ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌లో మార్పులు



Read also:

ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం విధించిన నిబంధనల్లో మార్పుల కారణంగా షెడ్యూల్‌ రెండు, మూడు రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. బదిలీల నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలని ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కోరాయి. ఇందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే ఉపాధ్యాయులు చేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెండు, మూడు రోజులు సమయం పట్టనుంది. ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటికి శుక్రవారం ఆమోదం లభించనుంది. అనంతరం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తారు.

పాఠశాలలో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా ప్రస్తుతం 8ఏళ్ళవరకు మాత్రమే పాయింట్ల కేటాయింపు పరిమితి విధించారు. ఈ పరిమితిని తొలగించి, పనిచేసిన కాలానికి పాయింట్లు ఇస్తారు.

సర్వీసు పాయింట్లు గరిష్ఠంగా 15 ఉండగా దీన్ని 16.5 పాయింట్లకు పెంచుతారు.

ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్ల సర్వీసును బదిలీకి ప్రామాణికంగా తీసుకుంటారు.

Teachers Transfer latest Clarifications-1

Teachers Transfer latest Clarifications-2


Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :