More ...
More ...

Tuesday, November 10, 2020

ఎస్సీ గురుకులాల్లో బదిలీలకు ఓకే



Read also:

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్లు, కాంట్రాక్టు టీచర్లతో పాటు నా టీచింగ్ సిబ్బంది బదిలీ కౌన్సి లింగ్ కు అనుమతిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రిన్సిపాల్స్, టీచర్లు, స్పెషల్ టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ ద్వారా నిర్వ హించనున్నారు. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ప్రిన్సిపాళ్లను కచ్చితంగా బదిలీ చేస్తారు. మిగతా వారిలో 8 ఏళ్లు సర్వీసు ఒకే చోట ఉంటే వారిని బదిలీ చేయనున్నారు. నవంబరు 18 2015 ముందు జాయిన్ అయిన ప్రిన్సిపాళ్లు, నవంబరు 18 2012కు ముందు జాయిన్ అయిన ఇతర ఉద్యోగులు కచ్చితంగా బదిలీ కావాల్సిందేనని నిబంధనలు పెట్టారు. అక్టో బరు 1 నాటికి 50 ఏళ్ల లోపు వయసున్న పురుష ప్రిన్సిపాళ్లు ఇతర టీచర్లు బాలికల గురుకుల పాఠశాలల్లో పనిచేస్తుంటే.. వారిని కచ్చితంగా బాలుర గురుకులాలకు బదిలీ చేస్తారు అక్టోబరు 1 నాటికి కేవలం రెండేళ్లు సర్వీసు ఉన్న ఉద్యోగు లకు, అంధులైన ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. అన్ని గురుకుల పాఠశాలల్లో రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులు సమానంగా ఉండేలా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :