Sunday, November 15, 2020

Base line test guidelines



Read also:

9 వ మరియు 10వ తరగతి విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ - ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక ప్రధానోపాధ్యాయులకు ముఖ్య గమనిక

  • తేదీ 16.11.2020 న  9 వ మరియు 10వ తరగతి విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించవలసిందిగా గౌరవ కమిషనర్, పాఠశాల విద్యాశాఖ, ఆంధ్ర ప్రదేశ్ వారు ఆదేశించడం జరిగింది
  • డీసీఈబీ కార్యాలయం  నుండి ప్రతి పాఠశాలలోని విద్యార్థులందరికీ  సరిపడా ప్రశ్న పత్రాలు అన్ని మండలాలకు పంపించ బడ్డాయి
  • తెలుగు, ఇంగ్లీష్ మీడియం వారికి విడివిడిగా ప్రశ్నా పత్రములు ప్యాక్ చేసి పంపించ బడ్డాయి
  • ప్రధానోపాధ్యాయులు అందరూ మండల విద్యాశాఖ అధికారులు నుండి ప్రశ్నాపత్రంల బండిల్స్ పొంది ఉంటారు 
  • బహుళైచ్ఛిక ప్రశ్నలతో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది
  • ప్రతి సబ్జెక్టులో 10 ప్రశ్నలు ఇవ్వబడతాయి 
  • మొత్తం ఆరు సబ్జెక్టులలో 60 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది
  • తేదీ 16.11.2020 న తప్పనిసరిగా బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి
  • పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
  • పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులను csc వెబ్ సైట్ నందు వెంటనే నమోదు చేయవలెను 
  • ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి వారి అంగీకారంతో అందరు విద్యార్థులు పరీక్షకు  హాజరు అయ్యేటట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలి
  • జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రకాశం జిల్లా వారి ఆదేశాలతో - సెక్రటరీ, డీసీఈబీ.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :