More ...
More ...

Friday, November 6, 2020

Base line exam in nov16th



Read also:

విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలను తెలుసు కునేందుకు 9,10 తరగతుల విద్యార్థులకు ఈ నెల 16న ప్రారంభ పరీక్ష (బేస్ లైన్ టెస్ట్)ను నిర్వహించనున్నారు. ప్రస్తుతం సంబంధిత తరగతులు చదువుతున్న విద్యార్థులు కొవిడ్ ఉదృతి దృష్యా గత విద్యా సంవత్సరం (2019-20) లో వార్షిక పరీక్షలు రాయకుండానే పాస్ అయినందున ఇప్పుడు ఆయా సబ్జెక్టుల్లో వారి సామర్యాలను తెలుసుకునేందుకు బేస్లైన్ పరీక్షను ఉద్దేశించారు. సబ్జెక్టుకు 10 మార్కు లకు బహుళైచ్చిక ప్రశ్నలు చొప్పున మొత్తం ఆరు సబ్జెక్టుల్లో 60 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ప్రశ్నపత్రాలను జిల్లా కామన్ పరీక్షల మండలి (డీసీఈబీ) ముద్రించి పాఠశాలలకు సరఫరా చేస్తుంది. జవాబు పత్రాలను మూల్యాకనం చేసిన తర్వాత విద్యార్థులు సాధించిన మార్కులను విశ్లేషణ నిమిత్తం సీఎస్ ఈ పోర్టల్ లో నమోదు చేయాలని విద్యాధికారులు సూచించారు. జిల్లాలో 9వ తరగతి విద్యార్థులు 51,887 మంది, పదో తరగతి విద్యార్థులు 53,271 మంది ఉన్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా పాఠశాలలకు విద్యార్థుల హాజరుపై పరిమితులు ఉన్నందున ఈ పరీక్ష నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఒక్కరోజులోనే ముగించకుండా రెండు రోజుల వ్యవధిలో నిర్వహించే అవకాశాలున్నాయి. దీనిపై అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :