Sunday, November 22, 2020

AP Weather Report



Read also:

ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశముంది. అనంతరం తుఫాన్‌గానూ మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నైఋతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది నైఋతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో తుఫానుగా మారే అవకాశం ఉంది.

ఇది వాయువ్య దిశగా ప్రయాణించి తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్ - మహాబలిపురంల మధ్య సుమారుగా నవంబర్ 25 వ తేదీ మధ్యాహ్నం/సాయంత్రం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలుకురిసే అవకాశముంది. 

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాంలో ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.  ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. 

దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.  నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈరోజు రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :