Sunday, November 29, 2020

Airtel mobile offer



Read also:

Airtel కూడా బంపర్ బొనాంజా ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్తగా 4G SIM తీసుకున్న కస్టమర్లతో పాటు, 4G డివైస్‌కు అప్‌గ్రేడ్‌ అయిన కస్టమర్లకు 11 GB వరకు ఇంటర్నెట్ ను ఎయిర్ టెల్ ఉచితంగా అందిస్తోంది.

Airtel కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లతో ముందుకు వచ్చేసింద. ఇఫ్పటికే మార్కెట్లోని పలు టెలికాం సంస్థలు పలు ఆఫర్లతో ఫ్రీ టాక్ టైంతో హడావిడి చేస్తుంటే, తాజాగా Airtel కూడా బంపర్ బొనాంజా ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్తగా 4G SIM తీసుకున్న కస్టమర్లతో పాటు, 4G డివైస్‌కు అప్‌గ్రేడ్‌ అయిన కస్టమర్లకు 11 GB వరకు ఇంటర్నెట్ ను ఎయిర్ టెల్  ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ను ప్రీపెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే ఇస్తామని Airtel పేర్కొంది. అయితే ఈ 11GB డేటాను రెండు విడతల్లో పొందే అవకాశం ఉంది. అందులో తొలి విడతలో కొత్తగా Airtel 4G కస్టమర్‌ Airtel Thanks యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే 5 GB డేటా వస్తుంది. ఇక మిగితా డేటా మొత్తం ఐదు 1 GB కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో యాప్‌లో క్రెడిట్‌ అవుతుంది. కొత్త మొబైల్‌ నంబర్‌ యాక్టివేట్‌ అయిన నెల రోజుల్లో Airtel Thanks యాప్‌లో రిజిస్టర్‌ కావాలి. ఐదు కూపన్లు వస్తే యాప్ లో లాగిన్ అయిన తర్వాత మై కూపన్స్‌ సెక్షన్‌కు వెళ్లి క్లెయిమ్‌ చేసుకోవాలి. అయితే 1GB డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్‌ అయిన 90 రోజుల్లోగా రీడిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా Airtel Thanks యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోతే 5GB డేటాకు బదులు 2GB డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Airtel కూడా తన అన్‌లిమిటెడ్‌ ప్యాకేజీ తీసుకునే వినియోగదారులకు దాదాపు 6 GB డేటా వరకు ఉచితంగా అందించనుంది. 84 రోజుల వాలిడిటీతో రూ.598 అంతకంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీలను ఎంచుకునే కస్టమర్లకు 6 GB డేటా ఉచితంగా వస్తుందని Airtel వెబ్‌సైట్‌లో పేర్కొంది.


అయితే అన్ లిమిటెడ్ ప్యాకేజీలో కూడా Data ఒకే సారి క్రెడిట్ కాదు. వినియోగదారులు ఆరు 1 GB ఉచిత డేటా కూపన్ల రూపంలో వస్తుంది. అలానే రూ.399 అంతకంటే ఎక్కువ ప్లాన్‌ తీసుకుంటే నాలుగు కూపన్లు, రూ. 219 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ తీసుకుంటే రెండు కూపన్లు వస్తాయి. Airtel Thanks యాప్‌ ద్వారా రీఛార్జి చేయాల్సి ఉంటుంది. కొత్త 4G Airtel కస్టమర్‌ అయి ఉండి రూ.598 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను తీసుకుంటే మొత్తం 11GB డేటా పొందవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :