Monday, November 23, 2020

Aadhar helpline center



Read also:

ఈ రోజుల్లో ప్రతి చిన్న పనికి ఆధార్ కార్డు తప్పనిసరి.. అయితే మీ ఆధార్ కార్డు లో ఏమైనా తప్పులు ఉన్నాయా.? మార్పులు చేసుకోవాలా..? ఆధార్ కార్డు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? హ.ఉంటే మాత్రం ఎవరు నివృత్తి చేస్తారు? ఆధార్ సెంటర్ కి వెళ్లడం తప్ప.. అని అనుకుంటున్నారా..? ఇప్పుడు ఆధార్ సెంటర్ కు వెళ్లవలసిన అవసరం లేదు.. హెల్ప్ లైన్ నెంబర్ కు ఒక ఫోన్ కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

ప్రయాణం చేయాలన్నా, ఎగ్జామ్ రాయాలన్నా, బ్యాంకులో నగదు డ్రా చేయాలన్నా ఇలా ప్రతి దానికి ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు. మన ఆధార్ కార్డు లో ఎటువంటి మార్పులు, చేర్పులు లేకపోతే సరే.

అదే ఒక చిన్న అక్షరం తప్పు పడిన, ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోయినా ఆధార్ సెంటర్ కి వెళ్లి వారు సూచించిన సంబంధిత పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అయితే ముందుగానే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమో తెలిస్తే వెళ్తూ వెళ్తూ వాటిని తీసుకెళ్లవచ్చు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆధార్ సెంటర్ కి వెళ్లి ఇంటికి వచ్చి మరలా తీసుకువెళ్లడం కష్టమైపోతుంది.

హెల్ప్ లైన్ వివరాలు :

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ సమస్యల పరిష్కారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. 1947 ఈ నెంబర్ కి ఫోన్ చేసి పరిష్కారం అడగవచ్చు. ఆధార్ హెల్ప్ లైన్ వారమంతా అందుబాటులో ఉంటుంది. ఏజెంట్ తో మాట్లాడేందుకు 1947 కాల్ చేయాలి. మీ సందేహాలను తీర్చుకోవడం కోసం సోమవారం నుండి శనివారం వరకు 7-9 గంటల వరకు ఫోన్ చేయవచ్చు. ఆదివారం 8-5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆధార్ హెల్ప్ లైన్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతి, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ భాషలలో సేవలను అందిస్తుంది.

ఒక్కరోజులో లక్షన్నర కాల్స్ :

ఆధార్ కార్డు హోల్డర్ తమ రిజిస్టర్ మొబైల్ ద్వారా హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి మీ ఆధార్ నెంబర్ ను చెప్పి మీ సందేహాన్ని తీర్చుకోవచ్చు. దగ్గరలోని ఆధార్ సెంటర్ వివరాలు, ఎన్రోల్మెంట్ స్టేటస్, ఆధార్ కార్డు డెలివరీ స్టేటస్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఆధార్ ప్రతినిధి మీ సందేహాలకు సమాధానం ఇస్తారు. కాల్ సెంటర్ ఒక రోజులో లక్షన్నర కాల్స్ స్వీకరించే సామర్థ్యం ఈ కాల్ సెంటర్ కు ఉంది. మీ మొబైల్, ల్యాండ్ లైన్ నుండి కూడా మీ సమీప ఆధార్ కేంద్ర వివరాలు పొందవచ్చు. మీ ప్రాంతంలోని ఆధార్ కేంద్రాల చిరునామాలు వంటి వివరాలను పొందవచ్చు. మీరు కేంద్రం యొక్క వివరాలను మై ఆధార్ ద్వారా కూడా పొందవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :