Wednesday, November 25, 2020

Aadhaar-PAN corrections online process



Read also:

Aadhaar-PAN: మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉంటే సరిచేయండి ఇలా

ఆధార్ కార్డు, పాన్ కార్డులో పేర్లు వేర్వేరుగా ఉండటం మామూలే. దరఖాస్తు ఫామ్ నింపే సమయంలోనే ఈ తప్పు జరుగుతుంది. ఇలా పేర్లు వేర్వేరుగా ఉండటం వల్ల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసే సందర్భంలో సమస్యలు వస్తాయి. మరి ఈ తప్పు ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోండి.

1. మీరు ఆధార్ నెంబర్‌ను పాన్ కార్డుతో లింక్ చేసేందుకు ప్రయత్నిస్తే ఎర్రర్ వచ్చిందా? రెండు కార్డులపై వివరాలు ఒకేలా లేకపోతే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ కాకపోవచ్చు. మీ పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఒకేలా ఉండాలి. 

2. రెండు కార్డుల్లో పేరు ఒకేలా లేకపోవడం వల్ల సమస్యలు తప్పవు. ఒకట్రెండు అక్షరాలు తేడా ఉన్నా ఆధార్-పాన్ లింక్ కాకపోవచ్చు. బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ ప్రూఫ్స్ సబ్మిట్ చేసినా దరఖాస్తు రిజెక్ట్ కావచ్చు. 

3. అందుకే ఇలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు మీ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో మీ వివరాలన్నీ ఒకేలా ఉండాలి. మరి ఈ రెండు కార్డుల్లో పేర్లు వేర్వేరుగా ఉంటే సరిచేసుకోవాలి. మీ పేరు కరెక్టుగా ఏ కార్డుపైన ఉందో చూసి మరో కార్డులో పేరు మార్చుకోవాలి. 

4. ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉంటే ఆన్‌లైన్‌లో సరిచేసుకోవచ్చు. SSUP పోర్టల్ ఓపెన్ చేసి మీ వివరాలన్నీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు పేరును అప్‌డేట్ చేయొచ్చు. మీరు దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత యూనిక్ రిక్వెస్ట్ నెంబర్-URN జనరేట్ అవుతుంది.

5. డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత రివ్యూ కోసం BPO సెలెక్ట్ చేసుకోవాలి. చివరగా మీరు మీ యూనిక్ రిక్వెస్ట్ నెంబర్-URN ద్వారా ఆధార్ అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డులో వివరాలు అప్‌డేట్ చేయడానికి ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు కూడా వెళ్లొచ్చు.

6. పాన్ కార్డులో పేరు తప్పుగా ఉంటే సరిచేసుకోవడానికి https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అప్లికేషన్ టైప్‌లో Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card సెలెక్ట్ చేసుకోవాలి.

7. మీ పేరు, పుట్టిన తేదీ, పాన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి. చివరగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. టోకెన్ నెంబర్ జెనరేట్ అవుతుంది. టోకెన్ నెంబర్ ద్వారా పాన్ దరఖాస్తు పూర్తి చేయాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :