Thursday, November 12, 2020

97 మంది టీచర్లకు పాజిటివ్



Read also:

  • కృష్ణా జిల్లాలో ఒక్కరోజే 124 కేసులు
  • తూర్పులో 8 మంది విద్యార్థులకు వైరస్
  • కరోనాతో ఉపాధ్యాయుడు మృత్యువాత

రాష్ట్రంలోని పాఠశాలల్లో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో బుధవారం 97 మంది ఉపాధ్యాయులు, 27 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఒక్క రోజులోనే 124 కేసులు నమోదవడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కాగా.తూర్పుగోదావరి జిల్లాలో మరో 8 మంది విద్యార్థులు కరోనా బారిన పడగా.. ఓ ఉపాధ్యాయుడు కొవిడ్తో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి జడ్పీ హైస్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గాలిదేవర త్రినాథరావు (45) బుధవారం కరోనాతో మృతిచెందారు. ఇటీవల ఆయనకు వైరస్ సోకడంతో కొన్నిరోజులుగా అమలాపురం కిమ్స్ కొవిడ్ సెంటర్ లో కిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందారు. అంబాజీపేట మండలం కె.వెదపూడి జిల్లా పరిషత్ హైస్కూల్ తొండంగి మండలం ఏవీ నగరం ఉన్నత పాఠశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరు హైస్కూల్ లలో ఒక్కో విద్యార్థికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది కె.గంగవరం మండలం కుందూరు ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులు దంగేరు ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థికి తాజాగా కొవిడ్ సోకింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :