Wednesday, November 11, 2020

5 Herbs in your home for better life



Read also:

5 Herbs : ఈ ఐదు రకాల మొక్కల్ని పెంచుకుంటే... ఇవి మన ఆరోగ్యాన్ని పెంచడమే కాదు. మనం తినే ఆహారానికి అదనపు ఫ్లేవర్‌ని కూడా ఇస్తాయి.

మన చుట్టూ ఉండే మొక్కల్లో కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి. ఉదాహరణకు తులసి మొక్క ఎంత మంచిదో మనకు తెలుసు. దాని నిండా ఔషధ గుణాలే. అలాంటివే మరికొన్ని ఉన్నాయి. అవి మనం తినే ఆహారానికి సువాసన, రుచి అందిస్తాయి. వాటిని రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే... మనల్ని రకరకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. మన మెదడును చురుగ్గా ఉంచే శక్తి మొక్కలకు ఉంది. అవి మనకు మంచి ఆక్సిజన్ ఇవ్వడమే కాదు... శరీరం లోపల విష వ్యర్థాల్ని తరిమేసి... ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాంటి ఐదు మొక్కల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని పెంచుకుంటూ... ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Stevia Herb : మనం పంచదారను ఎక్కువగా వాడితే బరువు పెరుగుతాం. ఫలితంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ స్టివియా మొక్కను పంచదార బదులు వాడొచ్చు. ఇది ఇళ్లలోనే పెరుగుతుంది. టీ పెట్టుకునేటప్పుడు... కొన్ని ఆకుల్ని తీసుకొని... టీలో వేస్తే చాలు... టీపొడితోపాటూ... ఇవీ మరిగి... స్వీట్‌నెస్ వచ్చేస్తుంది. పైగా ఈ ఆకులు కీళ్ల నొప్పులు, గుండెజబ్బుల నుంచి కాపాడతాయి. ముసలితనాన్ని అడ్డుకుంటాయి. దంతాల్ని కాపాడతాయి. నోట్లో బ్యాక్టీరియా ఉంటే అస్సలు ఊరుకోవు.

Cress Herb : క్రెస్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. రెండు వారాల్లోనే బోలెడు మొక్కలు, ఆకులు వస్తాయి. వీటిని కూరల్లో వాడితే... మన కంటి చూపు మెరుగవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాన్సర్‌ని ఈ మొక్కలు అడ్డుకుంటాయి. దంతాలు, చిగుళ్లను కాపాడతాయి. ఈ మొక్కల ఆకుల్ని జ్యూసులు, సలాడ్లు, పాస్తాలు ఇలా తినేవాటిలో వేసుకుంటే సరి... ఆరోగ్యం సంగతి ఇవి చూసుకుంటాయి.


Bloody Sorrel : మన బాడీలోని ధమనులు, సిరల్లా కనిపిస్తాయి ఈ ఆకులపై ఆకారాలు. అందుకే... ఈ మొక్కకు బ్లడీ సోరెల్ అనే పేరు పెట్టారు. ఈ మొక్కలు మధ్య ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకులు బీపీని తగ్గిస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి. బాడీలో విష వ్యర్థాల్ని తరిమి తరిమి కొడతాయి. వీటిలో విటమిన్ ఏ, సీ, మెగ్నీషియం ఉంటాయి. ఈ ఆకుల్ని శాండ్‌విచ్, సూప్స్, జ్యూసెస్, కూరల్లో వాడేస్తే సరి.

Hyssop Plant : ఔషధ మొక్కల్లో దీన్ని కింగ్ అంటారు. పూర్వకాలం నుంచి దీన్ని మందుల్లో వాడుతున్నారు. ఇదో పవిత్రమైన మొక్క. దీన్ని పూజల్లో ఎక్కువగా వాడుతారు. పవిత్ర క్షేత్రాల్లో ఉపయోగిస్తారు. ఇది వాతావరణాన్ని క్లీన్ చేస్తుందని చెబుతారు. ఈ మొక్క ఆకులు మన జీర్ణవ్యవస్థను బాగుచేస్తాయి. శ్వాస బాగా ఆడేలా చేస్తాయి. ఈ ఆకులు యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్‌గా పనిచేస్తాయి. కండరాల నొప్పిని పోగొడతాయి. ఇలా ఈ మొక్క ఆకుల వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య లాభాలున్నాయి. మీరు తినే ఆహారంలో ఈ మొక్క ఆకుల్ని అప్పుడప్పుడూ వేసేసుకోవడమే.

Sage Herb : ఇది కూడా ఔషధ మొక్కే. చాలా ఆహారాల్లో దీని ఆకుల్ని ఉపయోగిస్తారు. ఈ ఆకును చిన్న ముద్ద నోట్లో వేసుకొని తింటే చాలు... మెమరీ పవర్ పెరుగుతుంది, అలెర్టుగా మారతారు, చురుకుదనం వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. కడుపులో నొప్పి పోతుంది. గింజలు, పప్పులతో వంటలు వండుకుంటారు కదా... వాటిలో ఈ ఆకుల్ని వేసుకుంటే సరి. టేస్టుకు టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :