Wednesday, November 18, 2020

డిసెంబర్‌ 25న ఇళ్ల స్థలాల పంపిణీ



Read also:

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం​ డిసెంబర్‌ 25న ప్రారంభం కానుంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. డిసెంబర్‌ 25న అర్హులకు డి-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,68,281మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరందరికి పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి. తొలి దశలో దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

వాస్తవానికి జూలై 8నే ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

కొందరు స్వార్ధపరులు కోర్టుకు వెళ్లడంతో పలుమార్లు వాయిదా పడింది. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సంబంధించిన కాలనీలను ప్రభుత్వం ఎప్పుడో రూపొందించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వబోయే స్థలాలు గతంలోలా బలహీన వర్గాల గృహ సముదాయంలా ఉండదు. ఎలాంటి వసతుల్లేని అగ్గిపెట్టెల్లాంటి.డబ్బాల్లాంటి ఇళ్లు కాదు. విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించారు. ఇల్లు లేదనే వారు ఉండకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :