Friday, November 13, 2020

ఉపాధ్యాయుల రీఅప్పోర్షన్మెంట్ 2020 DSE AP వారి క్లారిఫికేషన్స్



Read also:

ఉపాధ్యాయుల రీఅప్పోర్షన్మెంట్ 2020 DSE AP వారి క్లారిఫికేషన్స్ (మెమో నెం.13029/11/2020 - EST3,తేది.12.11.2020)

అనంతపురం DEO గారు 👇

UP పాఠశాల HS గా అప్ గ్రేడ్  అయిన సందర్భాలలో అప్ గ్రేడ్ కాబడిన HS లో పనిచేయుచున్న ఉపాధ్యాయుల సర్వీస్ పాయింట్ల గణన కొరకు UP లోని సర్వీస్ ని కూడా పరిగణనలోనికి తీసుకొనవలెనా? లేక కేవలం HS లోని సర్వీస్ నే పరిగణన లోనికి తీసుకొనవలెనా?

క్లారిఫికేషన్ : పాయింట్ల గణన కొరకు ప్రస్తుత కేడర్ లో ప్రస్తుత పాఠశాలలోని సర్వీస్ ని మాత్రమే పరిగణనలోనికి తీసికొనవలెను 

ప్రకాశం DEO గారు 👇

జిల్లాలోని 13 పాఠశాలలకు సంబంధించి ది.03.11.2020 నాటికి అప్ డేట్ చేయబడిన నమోదునే రీ అప్పోర్షన్ కొరకు పరిగణనలోనికి తీసుకొనవలెనా?  లేక ది.03.11.2020 తర్వాతి నమోదు కూడా పరిగణనలోనికి తీసుకొనవచ్చా?

క్లారిఫికేషన్ : ది.03.11.2020 నాటికి అప్ డేట్ చేయబడిన నమోదునే ఎట్టి విచలనం లేకుండా పరిగణనలోనికి తీసికొనవలెను 

నెల్లూరు DEO గారు 👇

ఒక ఉన్నత పాఠశాలలో LP/PET గా పనిచేస్తూ పదోన్నతి ద్వారా అదే పాఠశాలలో SA గా నియమించబడిన సందర్భంలో... పాయింట్ల గణన కొరకు ప్రస్తుత కేడర్ లోని సర్వీస్ నే పరిగణనలోనికి తీసుకొనవలెనా ?  లేక పూర్వ కేడర్ లోని సర్వీస్ ని కూడా పరిగణనలోనికి తీసుకొనవచ్చా?

క్లారిఫికేషన్ : పాయింట్ల గణన కొరకు ప్రస్తుత కేడర్ లో ప్రస్తుత పాఠశాలలోని సర్వీస్ ని మాత్రమే పరిగణనలోనికి తీసికొనవలెను 

చిత్తూరు DEO గారు 👇

ఒక ఉపాధ్యాయిని కేజీబీవీ లో  స్పెషల్ ఆఫీసర్ గా డెప్యుటేషన్ పై పనిచేస్తూ.. ZPHS మదనపల్లి లో ది.02.07.2011 న రీ పాట్రియేట్ చేయబడ్డారు. తిరిగి అదేరోజున ఆమె కేజీబీవీ కి డెప్యూట్ చేయబడ్డారు. ఒక సంవత్సరం 10 నెలల తర్వాత ఆమె ది.04.05.2013 న మరలా తన ఒరిజినల్ ప్లేస్ లో జాయిన్ అయ్యారు. డెప్యుటేషన్ కాలంలో ఆమెకు జీతభత్యాలను ZPHS మదనపల్లి నుండే చెల్లించియున్నారు. ప్రస్తుతం ఆమె ZPHS మదనపల్లి లో డెప్యుటేషన్ కాలంతో కలిపి 8 సం సర్వీస్ పూర్తి చేసుకొనిఉన్నారు. ఆమె పనిచేయుచున్న పోస్ట్ ని ఖాళీగా చూపించవలెనా?  లేదా?

క్లారిఫికేషన్ : తన డెప్యుటేషన్ కాలంలో తన ఒరిజినల్ పాఠశాల నుండే జీతభత్యాలను పొందియున్నందున ఆవిడ గారు తప్పనిసరి బదిలీ క్రిందకు వస్తారు. 

విశాఖపట్నం DEO గారు 👇

SA (తెలుగు) పోస్టులో LP లు పనిచేస్తున్న సందర్భాలలో... సదరు SA (తెలుగు) పోస్టులను ఖాళీగా చూపించవలెనా?  లేదా?

క్లారిఫికేషన్ : GO MS No.53 , తేది.12.10.2020 లోని పట్టిక II B క్రింద గల 7 వ పాయింట్ ను అనుసరించగలరు. (సదరు SA పోస్టులను బదిలీల కొరకు ఖాళీ గానే చూపవలెను. LP లను (DEO పూల్) UP లలో  (నమోదు యొక్క అవరోహణ క్రమంలో) ఖాళీగా ఉన్న SGT పోస్ట్ లకు against గా సర్దుబాటు చేయవలెను )

Download the Latest rationalization clarifications

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :