Sunday, October 11, 2020

Whats app new feature



Read also:

మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? మీ వాట్సప్‌లో ముఖ్యమైన ఫైల్స్ సేవ్ చేసుకున్నారా? వాటిని వెతకలేకపోతున్నారా? సరికొత్త ఫీచర్ వచ్చింది. ఆ ఫీచర్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.


1. వాట్సప్ యూజర్లకు శుభవార్త. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని అందించే వాట్సప్. మరో అద్భుతమైన ఫీచర్ రిలీజ్ చేసింది. అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచర్‌ను అందిస్తోంది వాట్సప్.

2. కంప్యూటర్‌లో అయినా, స్మార్ట్‌ఫోన్‌లో అయినా ఫైల్స్ వెతకాలంటే సెర్చ్ ఆప్షన్ ఉపయోగిస్తాం. వాట్సప్‌లో కూడా సెర్చ్ ఆప్షన్ ఉంది.

3. సెర్చ్ ఆప్షన్‌ని మరింత అడ్వాన్స్‌డ్‌గా మార్చింది వాట్సప్. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ మెసేజెస్, ఫోటోలు డాక్యుమెంట్స్, ఆడియో, వీడియో ఫైల్స్ సులువుగా సెర్చ్ చేయొచ్చు. 

4. వాట్సప్‌లో సెర్చ్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఫైల్‌కు సంబంధించిన పదాన్ని లేదా కీవర్డ్‌ని టైప్ చేయాలి. ఒకవేళ అదే ఫైల్ పేరుతో ఎక్కువ ఫైల్స్ ఉంటే మీకు ఫిల్టర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

5. ఉదాహరణకు మీరు పాన్ కార్డ్ కోసం PAN CARD అని టైప్ చేశారనుకుందాం. ఆ పేరుతో ఇతర ఫైల్స్, మెసేజెస్ ఉన్నా అన్నీ కనిపిస్తాయి. కానీ మీకు కేవలం ఆ డాక్యుమెంట్ మాత్రమే కావాలనుకుంటే ఫిల్టర్‌లో డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేస్తే చాలు. మీ పాన్ కార్డ్ డాక్యుమెంట్ తప్ప ఇతర ఫైల్స్ కనిపించవు.

6. ఫోటోలు, వీడియోలు, లింక్స్, Gifs, ఆడియో, డాక్యుమెంట్స్‌కు ఇలాగే ఫిల్టర్స్ ఉపయోగించి మీకు కావాల్సిన ఫైల్స్ సులువుగా వెతకొచ్చు. 

7. అడ్వాన్స్‌డ్ సెర్చ్ ఫీచర్ వల్ల వాట్సప్‌లోని ఫైల్స్ సులువుగా, వేగంగా సెర్చ్ చేసే అవకాశం లభిస్తుంది యూజర్లకు.

8. ఇక వాట్సప్ ఇటీవల మరిన్ని ఫీచర్స్ రిలీజ్ చేసింది. ఒకే వాట్సప్ అకౌంట్‌తో నాలుగు డివైజ్‌లలో లాగిన్ కావొచ్చు.

Must read the below articles also

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :