Tuesday, October 27, 2020

Water on Moon



Read also:

Nasa Moon announcement 2020: చందమామపై నీరు ఉంది అనే విషయాన్ని మన ఇస్రో పంపిన చంద్రయాన్-2 ఎప్పుడో చెప్పింది. దానికి కొనసాగింపు అన్నట్లుగా.అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ - నాసా (NASA) మరో సంచలన ప్రకటన చేసింది.

Blue-moon

చందమామపై (ఉపరితలంపై) నీటిని కనుక్కున్నట్లు చెప్పింది. ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన నాసా.తాము కొత్తగా కనుక్కున్న అంశం ఎంతో ఆసక్తిని కలిగిస్తోందని చెప్పింది. చందమామపైకి మళ్లీ వ్యోమగాముల్ని పంపాలనుకుంటున్న తమకు.ఈ నీటి వార్త ఎంతో బూస్ట్ ఇస్తోందని వివరించింది. మీకు తెలుసు. 2024లో నాసా ఓ పురుష, ఓ స్త్రీ వ్యోమగాములను చందమామ దక్షిణ ధృవానికి పంపనుంది. ఈ కార్యక్రమాన్ని నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ (Artemis programme) అంటోంది. చందమామపై ఉన్న నీటిని వ్యోమగాములు తాగగలరనీ, లేదా.రాకెట్ ఇంధనం కోసం వాడగలరని నాసా చెబుతోంది.

నీటి శుభవార్త: ఇప్పటివరకూ సూర్యుడి కాంతి పడని ప్రాంతాల్లో నీరు ఉన్నట్లు తేలినా.తొలిసారిగా సూర్యుడి కాంతి పడే ప్రాంతంలో నీరు ఉన్నట్లు నాసా గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లైయింగ్ అబ్జర్వేటరీ అయిన సోఫియా (SOFIA) ద్వారా నాసా ఈ విషయాన్ని గుర్తించింది. చందమామ దక్షిణ ధ్రువంపై ఉండే.క్లావియస్ పగులులోయ (CLAVIUS CRATER)లో ఈ నీటిని గుర్తించింది. చంద్రుడి దక్షిణ ధృవంలో.అతి పెద్ద లోయ ఇదే. మనం భూమిపై నుంచి చూస్తే కూడా ఇది కనిపిస్తుంది. అందుకు బైనాక్యులర్ అవసరం. ఆ నీరు.ఓ చిన్న ఉల్కాపాతం వల్ల చందమామపై పడి ఉండొచ్చని భావిస్తున్నారు. లేదంటే.సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ పార్టికల్స్ వల్ల నీరు ఏర్పడి ఉండొచ్చనే అంచనా కూడా ఈ కొత్త పరిశోధన ద్వారా ఓ విషయం తెలిసింది. ఇప్పటివరకూ చంద్రుడి చల్లటి ప్రదేశాలు, నీడ ప్రదేశాల్లో మాత్రమే నీరు ఉందని అనుకునేవాళ్లు. ఇప్పుడు ఎండ పడే ప్రాంతాల్లో కూడా ఉందని తేలడం గొప్ప విషయమే. చందమామ ఉపరితలం మొత్తం నీరు ఉండొచ్చనే డౌట్ ఇప్పుడు కలుగుతోంది. చందమామ ఉపరితలంపై నీరు ఉందని తేలడంతో.ఇప్పుడు వైపర్ అనే నీటిని పరిశోధించో రోవర్‌ను చంద్రుడిపైకి పంపాలని నాసా అనుకుంటోంది. 2022 నాటికి అది చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరే ఛాన్స్ ఉంది. అది ఇచ్చే సమాచారం బట్టీ.మనుషుల ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. చందమామపై కాలనీలు నిర్మించాలనేది ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచన.తాజా పరిశోధనతో అందుకు మరో అడుగు ముందుకు పడినట్లే అనుకోవచ్చు.

Blue Moon: ఈ నెల 31న ఆకాశంలో బ్లూమూన్ కనిపించబోతోంది. సంపూర్ణ చందమామ.అత్యంత ఎక్కువ కాంతితో, పెద్ద పరిమాణంలో కనిపించబోతోంది. అక్టోబర్ 1న కూడా ఇలాంటిది వచ్చింది. కానీ.దాని కంటే ఇదే ఎక్కువ కాంతితో కనిపించనుంది. ఈసారి వచ్చే పెద్ద బ్లూ మూన్.ఎప్పుడో 76 ఏళ్ల కిందట రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1944లో వచ్చింది. మళ్లీ ఇప్పుడే హాలోవీన్ టైమ్‌లో వస్తోంది. అందువల్ల దీన్ని మిస్సవకుండా చూడమని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :