Monday, October 19, 2020

Transfers news



Read also:

ఉద్యోగోన్నతి మాకొద్ధు తిరస్కరించే యోచనలో ఉపాధ్యాయులు

ఒక ఉద్యోగికి ప్రమోషన్‌ వస్తుందంటే చాలా ఆనందపడతారు. అది ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. కానీ జిల్లా విద్యాశాఖలో పలువురు ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి ఇస్తామంటే మాకొద్దంటూ తిరస్కరిస్తామంటున్నారు. వినటానికి నమ్మశక్యం కాకపోయినా ఇది నిజమే. జిల్లాలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిలో 250 మందికి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్‌ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ జాబితా సిద్ధం చేసింది. వారిని సోమవారం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఆదేశించింది. వీరిలో చాలా మంది ఈ ఉద్యోగోన్నతి తమకు వద్దని తిరస్కరణ పత్రం ఇవ్వటానికి సమాయత్తమవుతున్నారు. దీనికి కారణం పోస్టింగ్‌ ఇవ్వకుండా నిరీక్షించాలని సూచించడమే. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ బదిలీలు పూర్తయ్యాక మిగిలిన ఖాళీల జాబితా వారి ముందు పెట్టి అప్పుడు పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఈ నిర్ణయం వారికి రుచించలేదు. ప్రమోషన్‌ కల్పించగానే వారికి పోస్టింగ్‌ చూపాలని వారు కోరుతున్నారు. అవసరమైతే ఆ తర్వాత వచ్చే జాబితాలో చూసుకుంటామని, అప్పటి వరకు తాము ప్రస్తుతం కొనసాగుతున్న క్యాడర్‌, పాఠశాలలోనే ఉంటామని పేర్కొంటున్నారు. కౌన్సెలింగ్‌ బదిలీలు పూర్తికావటానికి గరిష్ఠంగా 40 రోజులకు పైగా పట్టొచ్చని వినికిడి. అన్ని రోజులు వేచి చూసే ప్రమోషన్లు తమకు అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. ఒకసారి ఉద్యోగోన్నతి కోరుకుంటూ లేఖ ఇస్తే అతను పనిచేసే ప్రస్తుత పాఠశాలలో ఆ పోస్టును ఖాళీగా చూపుతారు. దీంతో సదరు ఉపాధ్యాయుడికి ప్రమోషన్‌పై పోస్టింగ్‌ దక్కేవరకు అతను ఎక్కడ పనిచేయాలో స్పష్టత ఉండదు. ప్రతినెలా ఆయన పనిచేస్తున్న పాఠశాల నుంచి ఖజానా అధికారికి ధ్రువీకరణ ఇవ్వకపోతే జీతం కూడా రాదు. ఇన్ని ఇబ్బందులతో ముడిపడి ఉన్న అంశం కావడంతో చాలా మంది ఈ సారికి నిరాకరిస్తేనే మేలనే అభిప్రాయంలో ఉన్నారని సమాచారం. శనివారం, ఆదివారం వచ్చిన అభ్యంతరాలను సరిచేసి తిరిగి నూతన జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలపై విద్యాశాఖ సరిగా స్పందించలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు

స్పష్టత ఇవ్వండి

పాఠశాలల్లో ఖాళీలు చూపకుండా ఉద్యోగోన్నతులు ఎలా ఇస్తారని ఈ మేరకు సంఘ నాయకులు ఆదివారం డీఈవో గంగాభవానిని కలిసి ఉద్యోగోన్నతి ఇచ్చేవారికి ఎప్పుడు పోస్టింగ్‌ ఇస్తారు? వారి ఖాళీలకు ఎలాంటి విధానం అవలంబిస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రమోహన్‌ తిరస్కరించినా, కౌన్సెలింగ్‌కు గైర్హాజరైనా జీవో నెం.145 ప్రకారం వారు కొనసాగుతున్న పాఠశాల లేదా వేరే స్కూల్‌ కేటాయించాలన్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారు 15 రోజుల్లో విధుల్లో చేరడం లేదా తిరస్కరిస్తూ వివరణ ఇస్తారని, ఆ లోపు వీరి పోస్టులను ఖాళీలుగా చూపరాదని డిమాండ్‌ చేశారు. ఈ నెలాఖరుకు ఉద్యోగ విమరణ పొందే వారికి పాఠశాల కేటాయించనున్నట్లు డీఈవో తెలిపారని వారు పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :