Wednesday, October 7, 2020

Train tickets on Amazon



Read also:

Train tickets on Amazon-అమెజాన్‌లో ట్రైన్ టికెట్ బుకింగ్, క్యాష్ బ్యాక్, ఇంకా చాలా ఆఫర్లు.

IRCTC తరహాలోనే Amazon Appలో కూడా కస్టమర్లు ట్రైన్‌లో సీట్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? ఏ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు.

  • ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా ఆరంభించింది. ప్రయాణికులకు తమ ప్లాట్ ఫాం ద్వారా టికెట్లు విక్రయించేందుకు IRCTCతో ఒప్పందం కూడా చేసుకుంది.
  • అమెజాన్ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ఆఫర్లు కూడా ప్రకటించింది. ఫస్ట్ టైమ్ టికెట్ బుక్ చేసుకునే వారికి 10 శాతం లేదా రూ.100 వరకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది.
  • ఇక అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఫస్ట్ టైమ్ టికెట్ బుకింగ్ మీద 12 శాతం డిస్కౌంట్ లేదా రూ.120 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ రెండు ఆఫర్లు కూడా లిమిటెడ్ కాలపరిమితి వరకే ఉంటాయి.
  • Amazon.in ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి సర్వీస్ చార్జీలు, పేమెంట్ గేట్ వే ట్రాన్సాక్షన్ చార్జీలను కూడా రద్దు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
  • ఇకపై Amazon Payలో ప్రత్యేక ట్రావెల్ కేటగిరీని ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా విమానం, రైలు, బస్సు టికెట్లు పొందవచ్చు.
  • IRCTC తరహాలోనే Amazon Appలో కూడా కస్టమర్లు ట్రైన్‌లో సీట్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? ఏ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలసుకోవచ్చు.
  • అలాగే, PNR Status కూడా చెక్ చేసుకోవచ్చు. (అమెజాన్‌లో బుక్ చేసిన వాటికి మాత్రమే). టికెట్ డౌన్ లోడ్ చేసుకోవడం, క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది.
  • Amazon Pay బ్యాలెన్స్ వాలెట్‌లో ముందుగానే డబ్బులు పెట్టుకుంటే టికెట్ బుకింగ్ సమయంలో మరింత సులువు అవుతుంది. ఒకవేళ రద్దీ వల్ల టికెట్ బుక్ కాకుండానే డబ్బులు కట్ అయిన పక్షంలో వెంటనే మీ అమెజాన్ పే వాలెట్‌కు డబ్బులు రిటన్ వచ్చేస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :