Friday, October 30, 2020

Today News highlights



Read also:

Today News highlights

బడిగంటలు మోగే వేళాయే
♦నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు
♦9,10, ఇంటర్‌ క్లాసులు ప్రారంభం
♦6,7,8 తరగతులకు నవంబర్‌ 23 నుంచి,
♦1 నుంచి 5 తరగతులకు డిసెంబర్‌ 14 నుంచి
♦బోధన రోజు విడిచి రోజు,ఒక్క పూట మాత్రమే క్లాసులు
♦షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తరగతుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. దీని ప్రకారం.. నవంబర్‌ 2 నుంచి 9,10,11/ఇంటర్‌ మొదటి సంవత్సరం, 12/ఇంటర్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు.. హాఫ్‌డే మాత్రమే నిర్వహిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2నే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో తరగతులు ఉంటాయి. నవంబర్‌ 23 నుంచి 6,7,8 తరగతులకు బోధన మొదలవుతుంది.
డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. 8వ తరగతి వరకు కూడా రోజు విడిచి రోజు, హాఫ్‌డే మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది.

13 నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు: ఏపీపీఎస్సీ
ప్రకటన సంఖ్య 06/2020కు (2020 - మే సెషన్‌) సంబంధించిన శాఖాపరమైన పరీక్షలు నవంబరు 21 నుంచి 29 వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారం https://psc.ap.gov.in  వెబ్‌సైట్‌లో ఉందని తెలిపింది. అభ్యర్థులు హాల్‌టికెట్లను నవంబరు 13 నుంచి పరీక్షల చివరి తేదీ వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. నోటిఫికేషన్‌ నెం.03/2019కి సంబంధించిన ‘అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌’ (ఏఎ్‌సఓ) ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు తెలిపారు. 

డిసెంబర్ 14నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు డిసెంబరు 14నుంచి 20వరకు జరగనున్నాయి. పరీక్షల రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2నుంచి 13 వరకు జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాలకు లోబడి నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఏపీపీఎస్సీ మెరిట్‌ లిస్టును సవరించింది. కమిషన్‌ వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in  లో మెరిట్‌ లిస్టు అందుబాటులో ఉంచారు. కాగా, మెయిన్స్‌కు మొత్తం 9,678 మంది అభ్యర్థులకు అర్హత లభించింది. 

నాడు-నేడు లో ఇంధన సామర్థ్య కార్యక్రమం
ఇంధన సామర్థ్య కార్యక్రమాల్ని గ్రామ స్థాయి నుంచి చేపట్టాలని, వాటిని ‘నాడు-నేడు’లోనూ చేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ఏపీ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని ఆమె వీడియో ద్వారా గురువారం నిర్వహించారు.

ఇంటర్‌ ప్రవేశాలకు స్పందన కరవు ఆన్‌లైన్‌ గడువు పొడిగింపు

ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి స్పందన కరవైంది. తొలి విడత కౌన్సెలింగ్‌కు 1.50 లక్షల మంది ప్రాసెసింగ్‌ రుసుం చెల్లించగా.. కళాశాలలు, కోర్సుల ఎంపికకు లక్ష మందే ఐచ్ఛికాలు ఇచ్చారు. ఏటా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు కలిపి మొత్తం 5 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ప్రస్తుతం అతి తక్కువ మందే ఆసక్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌ ప్రవేశాలు ప్రారంభించగా... 9 రోజుల్లో లక్ష మందే కళాశాలలను ఎంపిక చేసుకున్నారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గురువారంతో ప్రవేశాల గడువు ముగిసింది. విద్యార్థుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో గడువును నవంబరు 6వరకు పొడిగిస్తూ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.

సచివాలయ నియామక ప్రక్రియ 10లోగా పూర్తి చేయాలి

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియ నవంబరు 10వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గురువారం ఆదేశించారు. ఇందుకోసం అనుసరించాల్సిన విధానంపైనా పలు సూచనలు చేశారు.  జిల్లాల్లో ఖాళీల మేరకు మెరిట్‌ జాబితా ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు సమాచారాన్ని పంపి వచ్చే నెల 2 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎంపికైన వారందరికీ 11న కలెక్టర్లు నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు.. రాత పరీక్ష ఫలితాలపై సందేహాల నివృత్తి కోసం కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి గురువారం పలువురు అభ్యర్థులు ఫోన్లు చేశారు. కటాఫ్‌ మార్కులు తొలగించడంపై కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు తమ ఫిర్యాదులను కమిషనర్‌ కార్యాలయానికి మెయిల్‌ చేశారు.
ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును నవంబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి గురువారం ప్రకటనలో తెలిపారు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :