Wednesday, October 14, 2020

self driving car



Read also:

అప్పుడప్పుడూ మన కళ్లను మనమే నమ్మలేని వీడియోలను వైరల్ చేస్తుంటారు నెటిజన్లు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంకా చెప్పాలంటే.ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎలా అని ప్రశ్నించుకుంటున్నారు. ఆ కారు ఆటోమేటిక్ గా వెళ్లే లేటెస్ట్ మోడ్రన్ కారు కాదు. అదో ప్రీమియర్ పద్మినీ అకా ఫియట్ కారు. అంటే అది వెళ్లాలంటే కచ్చితంగా దాన్ని ఎవరో ఒకరు నడపాల్సిందే. మరి డ్రైవర్ సీటులో ఎవరూ లేకుండానే ఆ కారు దర్జాగా రోడ్డుపై వెళ్తుంటే.ఆశ్చర్యంగానే ఉంటుంది కదా.

ఈ వీడియోలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి.డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాడు. కానీ డ్రైవర్ సీటులో ఎవరూ లేరు.ఆ కారులో ఉన్నది ఒక వ్యక్తే. ఇది చూసిన మరో కారులో ప్రయాణికుడు. ఆశ్చర్యపోతూ.వీడియో షూట్ చేశాడు. కారు.రోడ్డుపై వెళ్తూ.లేన్స్ దానంతట అది మార్చుకుంటోంది. ఎలాంటి ప్రమాదమూ లేకుండా జాయ్ గా వెళ్తోంది. తమిళనాడులో ఈ దృశ్యం కనిపించింది.

ఇవాళ చూశాను. ఓ ముసలాయన పద్మినీ కారులో ఉన్నాడు. ప్యాసింజర్ సీటులో కూర్చున్నాడు. కానీ కారు నడుపుతున్నాడు. ఇదెలా సాధ్యం" అని ఆ ప్రయాణికుడు తన వీడియోతో ప్రశ్నించాడు.

చిత్రంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లైతే ఇదెలా సాధ్యం అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. దెయ్యం కారు నడుపుతోందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

ఆ కారును కంటికి కనిపించని వ్యక్తి ఎవరో  నడుపుతున్నట్లున్నారు అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. దెయ్యాలు నిజంగానే ఉన్నాయా అని మరొకరు అన్నారు.

ఇంతకీ కారు నడుపుతున్నది ఎవరు?

డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న వ్యక్తే కారు నడుపుతున్నట్లు అనుకోవచ్చు. ఎలాగంటే.అతను తన చేతిని సాగదీసి.స్టీరింగ్ ను పట్టుకొని ఉండొచ్చు. అలాగే.ఆ కారుకు రెండు వైపుల ఉండే పెడల్ సిస్టం ఉందేమో. సాధారణంగా డ్రైవింగ్ స్కూల్ కార్లకు అలాంటి సిస్టం ఉంటుంది. డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ ఇద్దరూ.వేర్వేరుగా క్లచ్ లు, యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ కలిగివుంటారు. ఆ వ్యక్తి ఇది వరకు కూడా ఇలా కారు నడిపినట్లు కొందరు ఫేస్ బుక్ యూజర్లు తెలిపారు.

"ఫ్రంట్ సీట్ అనేది ఫుల్ సీటు. స్టీరింగ్ వీల్ కింద గేర్ ఉంటుంది. హైవేకి టాప్ గేర్ లో వెళ్లాక. అతను డ్రైవింగ్ సీట్ నుంచి పక్క సీటుకు వెళ్తాడు. అతను యాక్సిలరేటర్ పెడల్ వాడుతాడు. అంటే డ్రైవింగ్ స్కూల్ వాహనంలో లాగా చేస్తాడు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే... అతను డ్రైవింగ్ సీటులోకి వెళ్తాడు. అతను ఆ కారును 3 లేన్ హైవే పై ఎక్కువగా నడుపుతాడు. తద్వారా ఏదో ఒక లేన్ అతనికి ఖాళీగా దొరుకుతుంది" అని ఓ యూజర్ తెలిపారు.ఆ కారులో వ్యక్తి వెల్లూరికి చెందినట్లు తెలిసింది. దీనిపై క్లారిటీ లేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :