Thursday, October 29, 2020

Schools will be open in nov2



Read also:

నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు‌, కాలేజీలు ప్రారంభం

పటిష్టంగా కోవిడ్‌ రక్షణ చర్యలు

రోజువిడిచి రోజు పాఠశాలల్లో తరగతులు

కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్‌ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.

AP: పాఠశాలలు, కాలేజీలు ప్రారంభంపై ఏపీ సీఎంవో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 9, 10, 11 12 తరగతుల విద్యార్థులకు నవంబర్ 2 నుంచి.. 6, 7, తరగతుల విద్యార్థులకు నవంబర్ 23 నుంచి క్లాసెస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులు ప్రారంభం కానున్నాయి.

  • నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. 
  • నవంబర్‌ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు. 
  • హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు. 
  • నవంబర్‌ 23 నుంచి 6,7,8  క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. 
  • డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.
అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :