Friday, October 30, 2020

Schools in 3 stages



Read also:

  • 3 దశల్లో పాఠశాలలు
  • నవంబరు 2 నుంచే తరగతులు
  • డిసెంబరు 14 నుంచి ప్రాథమిక బడులు
  • ఉన్నత విద్యలో 1/3 విధానంలో విద్యార్థుల హాజరు
  • 100 కిలోమీటర్లపైన దూరముంటే 90 రోజుల వసతి
రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు నవంబరు 2 నుంచే పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలను 3 దశల్లో తెరవనున్నారు. రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈమేరకు తరగతుల నిర్వహణ, ప్రారంభ షెడ్యూల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థల అన్నింటికీ ఇదే వర్తించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30ని చివరి పనిదినంగా నిర్ధారించారు. నవంబరు 2 నుంచి 2021 ఏప్రిల్‌ 30 మధ్య మొత్తం 140 పనిదినాలు రానున్నాయి. 

  • 9,10 తరగతులు, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబరు 2 నుంచి రోజు విడిచి రోజు ఒంటిపూట తరగతులు ఉంటాయి.
  • నవంబరు 23 నుంచి 6, 7, 8 తరగతులకు బోధన ప్రారంభమవుతుంది. వీరికి రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు కొనసాగుతాయి.
  • డిసెంబరు 14 నుంచి 1-5 తరగతులు మొదలవుతాయి. వీరికి సైతం రోజు విడిచి రోజు ఒంటిపూట బడి ఉంటుంది.
  • ఉన్నత విద్యకు సంబంధించి డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ, ఫార్మసీ అన్ని కళాశాలలకు విడతల వారీగా తరగతులు ఉంటాయి.
ఈ ఏడాదికి ఒకే సమ్మెటివ్‌ పరీక్ష

  • పా§ఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. పాఠ్యాంశాలను మూడు విభాగాలుగా విభజించింది. వాటిని తరగతి గదిలో బోధించేవి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు చదువుకునేవి, విద్యార్థులే ఇంటి వద్ద చదువుకునేవిగా వర్గీకరించింది. తప్పనిసరి పాఠ్యాంశాలను ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధిస్తారు.
  • కొన్ని పాఠ్యాంశాలను వాట్సప్‌ లేదా తరగతికి వచ్చిన సమయంలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు చదువుకోవాల్సి ఉంటుంది. అభ్యాసన ప్రక్రియలో భాగంగా వర్క్‌బుక్స్‌ వంటివి ఉంటాయి. ఈ విధానంలో పాఠ్యాంశాల బోధన 30-50% వరకు తగ్గనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు కొనసాగుతాయి.
  • ఈ ఏడాది సమ్మెటివ్‌ పరీక్ష ఒక్కటే ఉంటుంది. ఫార్మెటివ్‌లు రెండు ఉంటాయి.
  • ఇంటర్‌కు సంబంధించి ఇప్పటికే 30% పాఠ్యాంశాలను తగ్గించారు. రెండో ఏడాది ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతుండగా మొదటి ఏడాది ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
10 రోజులకోసారి విద్యార్థుల మార్పు
  • డిగ్రీ, ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది మినహా అన్నీ నవంబరు 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
  • ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది డిసెంబరు 1, డిగ్రీ తరగతులు అదే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.
  • ఉన్నత విద్యా సంస్థల్లో కొంత ఆన్‌లైన్‌, మరికొంత ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు.
  • కళాశాల విద్యార్థులలో 1/3 వంతు చొప్పున విడతల వారీగా 10 రోజులపాటు తరగతుల్లో పాఠాలు బోధిస్తారు. ఆ తర్వాత మొదటి బ్యాచ్‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు ఉంటాయి. మరో బ్యాచ్‌ 1/3 విద్యార్థులు తరగతులకు హాజరవుతారు.
  • మొత్తం ఒక సెమిస్టర్‌కు సంబంధించిన 90 రోజుల్లో 30 రోజులపాటు విద్యార్థులకు తరగతులు ఉంటాయి.
  • వసతి గృహాలను ఇదే విధానంలో కేటాయిస్తారు. తరగతులకు వచ్చిన వారికి వసతి గృహం సదుపాయం కల్పిస్తారు. విద్యార్థులు విడతల వారీగా మారుతూ ఉంటారు.
  • వంద కిలోమీటర్ల కంటే దూరం నుంచి వచ్చే విద్యార్థులకు మాత్రం సెమిస్టర్‌ మొత్తం వసతి కల్పిస్తారు.
  • ఏదైనా తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు గ్రూపులుగా విభజిస్తారు.
  • సీట్ల మధ్య ఆరు అడుగుల దూరం ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :