Saturday, October 31, 2020

Schools from Monday: 180 working days



Read also:

  • సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో బడిగంటలు మోగబోతున్నాయి.  కోల్పోయిన విద్యాసంవత్సరాన్ని కవర్ చేసేలా సిలబస్ రూపొందించినట్టు ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
  • కేంద్రం గైడ్ లైన్స్ ను పాటిస్తూ పాఠశాలలు తెరుస్తామని అన్నారు.  అన్ని జాగ్రత్తలతో స్కూళ్లను తెరుస్తున్నట్టు అయన తెలిపారు.
  • నవంబర్ 2 నుంచి 9,10 తరగతులలో పాటుగా సెకండ్ ఇయర్ ఇంటర్ తరగతులను ప్రారంభిస్తామని అన్నారు.
  • నవంబర్ 16 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు జరుగుతాయని తెలిపారు.
  • నవంబర్ 23 నుంచి 6,7,8 తరగతులు, డిసెంబర్ 14 నుంచి 1-5 తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
  • నవంబర్ 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ళు, హాస్టళ్లు ప్రారంభిస్తామని అన్నారు.  ఇప్పటికే డిగ్రీ, పీజీ తరగతులకు షెడ్యూల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.  2020-21విద్యా సంవత్సరాన్ని వచ్చే ఏడాది ఆగష్టు నాటికి పూర్తి చేస్తామని అన్నారు.
  • స్కూళ్ల పనిదినాలు 180 రోజులు ఉంటాయన్నారు. ఇక స్కూళ్లకు సంబంధించిన అకాడమిక్ ఇయర్ వచ్చే ఏడాది ఏప్రిల్ నెలతో ముగిసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :