Sunday, October 11, 2020

SBI Yono app balance check



Read also:

SBI Yono app: ఎస్‌బీఐ యోనో యాప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక సులువుగా బ్యాలెన్స్ తెలుసుకోండి ఇలా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ ఖాతాదారులకు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా ప్రత్యేక ఫీచర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మరిన్ని ఫీచర్స్ వచ్చాయి. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.


1. ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌ని అందిస్తోంది ఎస్‌బీఐ. సాధారణంగా ఎస్‌బీఐ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే లాగిన్ కావాల్సి ఉంటుంది. కానీ లాగిన్ కావాల్సిన అవసరం లేకుండా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. 

2. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడం మాత్రమే కాదు పాస్‌బుక్ కూడా చూడొచ్చు. లావాదేవీలు కూడా జరపొచ్చు. అకౌంట్‌లో లాగిన్ చేయకుండానే ఈ సేవలన్నీ పొందొచ్చు. 

3. ఎస్‌బీఐ యోనో యాప్‌లో సేవల్ని పొందాలంటే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తప్పనిసరి. ఇవి కాకుండా 6 అంకెల ఎంపిన్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ లేదా ఫేస్ ఐడీ ద్వారా ఈ సేవల్ని పొందొచ్చు. ఇందుకోసం ముందుగానే సెట్టింగ్స్ చేయాలి. 

4. కస్టమర్లు ఎస్‌బీఐ యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత View Balance పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎంపిన్, బయోమెట్రిక్ లాంటి వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు 

5. మీ అకౌంట్లకు సంబంధించిన బ్యాలెన్స్ ఎంతో యోనో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు గతంలో జరిపిన ట్రాన్సాక్షన్స్ వివరాలు తెలుసుకోవాలంటే View Transactions పైన క్లిక్ చేయాలి. 

6. మీరు యోనో యాప్ ద్వారా సులువుగా పేమెంట్స్ చూడా చేయొచ్చు. లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా రూ.2,000 వరకు లావాదేవీలు జరపొచ్చు. Yono Quick Pay క్లిక్ చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. 

7. ముందుగా Yono Quick Pay క్లిక్ చేసిన తర్వాత ఎంపిన్, బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఫేస్ ఐడీ ద్వారా ఆథెంటికేషన్ చేసి పేమెంట్ పూర్తి చేయొచ్చు. 

8. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI యూ ఓన్లీ నీడ్ వన్-Yono పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను 2017 నవంబర్‌లో ప్రారంభించింది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, షాపింగ్ లాంటి సేవలన్నీ ఈ యాప్ ద్వారా పొందొచ్చు.

Must read the below articles also

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :