Sunday, October 18, 2020

SBI Instructions to users



Read also:

స్టేట్ బ్యాంక్‌లో మీకు అకౌంట్ ఉంటే.. కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటూ ఎస్‌బీఐ బ్యాంక్‌ వారు తాజాగా తన కస్టమర్లను హెచ్చరించింది. కొన్ని తప్పులు చేయవద్దంటూ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లను హెచ్చరిస్తుంది. అనేక మోసాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తమ ఖాతాదారులు కొంచెం అప్రమతంగా ఉండాలని సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.


ఏటీఎం మోసాలతో పాటు ఆన్లైన్ లో కూడా అనేక మోసాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని, మోసగాళ్లు ఎలా అయినా మోసాలకు పాలపడ్డవచ్చని కస్టమర్లకు సూచించింది. ఎస్బీఐ కస్టమర్లు వారి బ్యాంక్ అకౌంట్ను జాగ్రత్తగా ఉంచుకోవాటానికి పలు టిప్స్ సూచించింది.

అలాగే కొన్ని తప్పులు చెయ్యవద్దని కస్టమర్లను అలర్ట్ చేసింది. పండుగ సీజన్ వస్తున్న సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వొచ్చని కూడా హెచ్చరించింది. ముఖ్యంగా ఈ ఐదు తప్పులు అసలు చేయవద్దని సూచించింది. వన్ టైమ్ పాస్వర్డ్ OTP, పిన్ నెంబర్, క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డులపై ఉంటే సీవీవీ నెంబర్, యూపీఐ పిన్ వంటివి అసలు ఎవ్వరికీ షేర్ చేయవద్దని సూచించింది. బ్యాంక్ అధికారులు ఎప్పుడు కాల్ చేసి కార్డు, అకౌంట్ వివరాలు అడగరని తెలిపారు. ఎవరయినా ఆలా చేసి అడిగితే వెంటనే మీ దగ్గరలో ఉన్న బ్యాంకులో ఫిర్యాదు చేయాలనీ సూచించారు.

మీకు ఎవరైనా కాల్ చేసి పాస్ వర్డ్ మార్చాలని, మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ లేదా కార్డుపై ఉండే సీవీవీ నెంబర్ చెప్పమని అడిగితే వెంటనే కాల్ కట్ చెయ్యాలని చెప్పారు. కొంత మంది కాల్ చేసి కార్డు బ్లాక్ అవుతుందని, కార్డు వివరాలు తెలియజేయాలని కోరవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ అప్రమతంగా ఉండాలి అని సూచిస్తున్నారు. మీ సొంత స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ తప్ప ఇతర ఫోన్, ల్యాప్టాప్లలో బ్యాంక్ లావాదేవీలు జరపకూడదని వారు సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :