Monday, October 12, 2020

SBI Get the checkbook if your address changed



Read also:

SBI Get the checkbook if your address changed

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారుల సౌలభ్యం కొరకు నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఎస్బీఐ కస్టమర్లు తమ రిజిస్టర్డ్ చిరునామాలో లేకుంటే ఇకపై ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తమకు నచ్చిన ఏ చిరునామాకైనా మీ చెక్ బుక్‌ను డెలివరీ చేసుకునే అవకాశం కల్పించింది ఎస్బీఐ.

తాజాగా దీనికి సంబంధించి ఎస్బీఐ ట్వీట్ చేస్తూ ‘మా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకొని మీ ప్రస్తుత చిరునామాకు కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా చెక్ బుక్ డెలివరీని అభ్యర్థించండి." అని పేర్కొంది.

1. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేసి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి.

2. లాగిన్ అయిన తర్వాత 'రిక్వెస్ట్ & ఎంక్వైరీస్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి

 3. డ్రాప్-డౌన్ మెనులో ఉండే 'చెక్ బుక్ రిక్వెస్ట్' ఆప్షన్పై క్లిక్ చేయండి 

 4. మీ అకౌంట్ వివరాలన్నీ తదుపరి స్క్రీన్లో ప్రదర్శించబడతాయి. 

5. మీ చెక్‌బుక్ ఖాతాను సెలెక్ట్ చేసుకొండి. 

6. మీకు కావాల్సిన చెక్కుల సంఖ్య కొరకు డ్రాప్ బాక్స్‌లో ఆప్షన్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) 

7. మీ చెక్కుల సంఖ్యను సెలెక్ట్ చేసుకున్న తర్వాత, 'సబ్మిట్'పై క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం) 

8.దాని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ డెలివరీ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఇందుకు గాను రిజిస్టర్డ్ అడ్రస్, చివరగా అందుబాటులో ఉన్న డిస్పాచ్ అడ్రస్, న్యూ అడ్రస్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. 

వీటిలో కొత్త అడ్రస్‌ను సెలెక్ట్ చేసుకొని మీ అడ్రస్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్ క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేసి మీ చెక్‌బుక్ డెలివరీ అడ్రస్‌ను మార్చుకోండి. 

ఎస్బీఐ చెక్ బుక్ దరఖాస్తు చేయడానికి అనేక మార్గాలున్నాయి. మీ హోమ్ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించడం, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్, సమీప ఎస్బీఐ ఎటిఎంను సందర్శించడం వంటి మార్గాల ద్వారా కూడా మీ చెక్‌బుక్‌ను పొందవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :