Friday, October 2, 2020

Sanitizer check with wheat flour



Read also:

Put a pinch of wheat flour to tell if your sanitizer is good or not

  1. కరోనావైరస్‌ సోకకూడదంటే నిత్యం చేతులు కడుక్కుంటూ ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చేతులు కడుక్కునే అవకాశం లేనప్పుడు శానిటైజర్ రాసుకోవాలని సూచిస్తున్నారు.
  2. దీంతో శానిటైజర్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇళ్లలో, పనిచేసే చోట, బయట దుకాణాల్లో... ఇలా ప్రతి చోటా శానిటైజర్ వాడకం మొదలైంది.
  3. అయితే, ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కొన్ని సంస్థలు అక్రమంగా లాభాలు పొందాలని చూస్తున్నాయి. నాసిరకం, కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.
  4. ‘’99.9% వైరస్‌లను చంపేస్తుంది’, ‘పరిమళభరిత శానిటైజర్’, ‘ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్’ఇలా రకరకాలుగా చెబుతూ మార్కెట్లో శానిటైజర్లు విక్రయిస్తున్నారు.
  5. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు కరోనావైరస్ నుంచి మెరుగైన రక్షణ కల్పిస్తాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువ మంది వీటినే వాడుతున్నారు.
  6. కానీ, మనం ఉపయోగించే శానిటైజర్ నాణ్యమైనదేనా? దాని వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు) ఉంటాయా? చర్మానికి అవి పడతాయా? ఇవన్నీ తెలుసుకోవడం ఎలా?
  7. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే కన్జ్యూమర్స్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల ముంబయి, థానె, నవీ ముంబయిల్లో శానిటైజర్స్ శాంపిల్స్‌ను సేకరించి, వాటిని విశ్లేషించింది. వాటిలో 50 శాతానికిపైగా నాసిరకమైనవేనని తేల్చింది.
ఆ అధ్యయనంలో

  • 122 శానిటైజర్ శాంపిల్స్‌ను సేకరించి, పరీక్షించారు.
  • 45 శాంపిళ్లలో కల్తీ జరిగినట్లు తేలింది.
  • ఐదు శాంపిళ్లలో మనుషులకు హాని చేసే మెథనాల్ ఉన్నట్లు వెల్లడైంది.
  • 55 శాంపిళ్లలో మాత్రం ఆ సీసాలపై ముద్రించిన ప్రకారమే పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.
  • తాము సేకరించిన శాంపిళ్లపై గ్యాస్ క్రొమటోగ్రఫీ పరీక్షలు చేసినట్లు కన్జ్యూమర్స్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవ కార్యదర్శి డాక్టర్ ఎం.ఎస్.కామత్ చెప్పారు.
45 శాంపిళ్లలో కల్తీ జరిగినట్లు మేం గుర్తించాం. ఆయా శానిటైజర్ల సీసాలపై ముద్రించినట్లుగా అందులోని పదార్థాలు లేవు. కొన్ని శానిటైజర్లలో మిథైల్ (మిథనాల్ ఆల్కహాల్) ఉంది. దాని వాడకంపై నిషేధం ఉన్నా, విరివిగా ఉపయోగిస్తున్నారు. దానిని ఉపయోగించి తయారుచేసే శానిటైజర్లతో ప్రజలకు ఆరోగ్యానికి ప్రమాదం ఉంది. కానీ, అవి బ్రాండెడ్ శానిటైజర్లుగా ప్రచారం అవుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.

ఏమిటీ మిథైల్ ఆల్కహాల్?

అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) మిథైల్ ఆల్కహాల్‌ను విషపూరిత పదార్థంగా గుర్తించింది. చర్మం, కళ్లు, ఊపిరితిత్తులకు ఇది హాని చేస్తుందని పేర్కొంది.

మిథైల్ ఆల్కహాల్‌ను ప్లాస్టిక్, పాలిస్టర్, ద్రావకాల తయారీలో ఉపయోగిస్తారు.

‘‘మిథైల్ ఆల్కహాల్‌ను చర్మం పీల్చుకుంటుంది. ఫలితంగా దాని వల్ల హాని జరగొచ్చు. వాంతులు, తలనొప్పి వంటివి కూడా వస్తాయి. ఒకవేళ అది కళ్లకు తాకినా, ప్రమాదమే. తీవ్రత ఎక్కువైతే మనిషి చనిపోవచ్చు కూడా’’ అని కామత్ వివరించారు.

శానిటైజర్లకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని చాలా మంది నాసిరకం శానిటైజర్లు అమ్ముతున్నారని, వాటిని వాడితే చర్మానికి ప్రమాదమని కాస్మొటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రింకీ కపూర్ అన్నారు.

శానిటైజర్ కొంటున్నప్పుడు జనం జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సూచించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శానిటైజర్లకు ఫార్ములాను సూచించింది. దాని ప్రకారమే వాటిని తయారు చేయాలి. ఇథైల్ ఆల్కహాల్ మోతాదు తక్కువైనా, శానిటైజర్ సరిగ్గా ప్రభావం చూపలేదు. కాబట్టి, అది ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. తనిఖీలు పెంచుతాం. అక్రమాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు ఆదేశాలు ఇచ్చాం’’ అని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ థోపె బీబీసీతో అన్నారు.

తమ అధ్యయనంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిందని, అధ్యయన నివేదికను తమకు అందజేయాలని కోరిందని డాక్టర్ కామత్ చెప్పారు.

మా నివేదికను ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేశాం. ప్రభుత్వం ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి విషయం ఇది’’ అని ఆయన అన్నారు.

డబ్ల్యూహెచ్ఓ, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం శానిటైజర్‌కు ఎలాంటి పరిమళాలు ఉండకూడదు. అది ఎక్స్పైరీ అయ్యే తేదీ, తయారీదారు లైసెన్సు నెంబర్ వివరాలను సీసాపై స్పష్టంగా ముద్రించాలి. పీహెచ్ స్థాయి కూడా 6 నుంచి 8 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలి. 99.9% సూక్ష్మ జీవులను నిర్మూలించగలగాలి’’ అని డాక్టర్ కపూర్ చెప్పారు.
ఎలాంటి శానిటైజర్ కొనాలి?
  • శానిటైజర్‌లో ఇథైల్ ఆల్కహాల్ పాళ్లు 70 శాతం ఉండాలని ముంబయికి చెందిన డెర్మటాలజిస్ట్ బిందు స్థలేకర్ అంటున్నారు.
  • ఆల్కహాల్ చేతులను పొడిబారేలా చేయొచ్చు. అందుకే అందులో గ్లిసరిన్ ఉండటం కూడా అవసరం. ఎలర్జీలు ఉన్నవారు పరిమళాలు ఉన్న శానిటైజర్లు వినియోగించకపోవడం మంచిది’’ అని ఆమె అన్నారు.
  • మరి, ఏ శానిటైజర్ మంచిదో తెలుసుకోవడం ఎలా?
  • ఓ చిన్న పరీక్ష ద్వారా ఈ విషయం తేల్చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్ కపూర్.
  • ఒక చెంచాడు గోధుమ పిండి తీసుకొని, దానికి శానిటైజర్ కలపండి. ఒకవేళ పిండి అతుక్కుపోతే శానిటైజర్ మంచిది కాదని అర్థం. పిండి పొడిగానే ఉంటే, అది మంచిదని అర్థం’’ అని ఆమె చెప్పారు.
పరిశోధకులకు బెదిరింపులు

శానిటైజర్లపై తమ అధ్యయన నివేదిక వెల్లడించాక, తమకు బెదిరింపులు వస్తున్నాయని డాక్టర్ కామత్ చెప్పారు.

నాకు నాలుగైదు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. మేం తప్పుడు సమాచారం చెబుతున్నామని, పరువు నష్టం దావా వేస్తామని బెదిరించారు. ఇలాంటి కాల్స్ మాకు సహజమే. మేం వీటికి భయపడం. ప్రజల కోసం పనిచేస్తాం’’ అని ఆయన అన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :