Wednesday, October 7, 2020

Register for mlc vote



Read also:

మళ్లీ నమోదు చేసుకుంటేనే ఓటు Re Register for mlc vote

తాజా ఓటరు జాబితాతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

గతంలో ఓటరుగా నమోదైన వారి ఓట్లన్నీ రద్దు

ఆన్‌లైన్లో ఫారం-19 ద్వారా ఓటరుగా నమోదు

Reregister_for_MLC_vote


  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజా ఓటర్ జాబితానే ఎన్నికల సంఘం వినియోగించనుంది. 
  • గతంలో ఓటుహక్కు పొంది ఉన్నా సరే వారు మళ్లీ కొత్తగా ఓటరు జాబితాలో పేరు చేర్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే. లేకుంటే వారికి ఓటు హక్కు ఉండదు.
  • అర్హులైన ఉపాధ్యాయులు ఓటు హక్కు కోసం ఫారం-19లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఈవో ఆంధ్ర.ఎన్ ఐసీ.ఇన్ వెబ్ సైట్లో ఇప్పటికే ఓటరు నమోదు కోసం ఉపాధ్యాయులకు అవకాశం కల్పించారు. 
  • ఈ నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
  • 2015లో ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు రెండు జిల్లాల నుంచి మొత్తం 18,931 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. 
  • అయితే ఆ ఎన్నికల్లో మూడువేల మంది వరకు ఓటుహక్కుని వినియోగించుకోలేకపొయారు. ఈ దఫా కూడా ఇంచుమించుగా అంతే సంఖ్యలో ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
  • ఉపాధ్యాయ స్కూల్ అసింట్ అంతకంటే ఎక్కువ ర్యాంకు కలిగిన వారికే ఓటరుగా నమోదు అయ్యే అవకాశం ఉన్నది.
  • జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు అర్హత ఉంటుంది.
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ సీనియారిటీ కలిగిన ఉపాధ్యాయులకు కూడా ఓటుహక్కు పొందవచ్చు. అయితే దీనిపై తగిన అవగాహన లేకపోవడంతో గత ఎన్నికల్లో చాలామంది ఓటుహక్కు పొందలేకపోయారు.
  • ఓటరుగా నమోదు చేసుకొనేందుకు నెలరోజుల గడువు ఉన్నందున ప్రభుత్వ విద్యాసంస్థలు, గవర్నమెంట్ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
  • ప్రభుత్వ విద్యాసంస్థల్లో కంటే గుర్తింపు పొందిన వాటిల్లో ఎక్కువమంది ఉన్నారు. అయితే వారు అందుకు తగిన ఆధారాలను నివేదించాల్సి ఉంటుంది.
  • ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఓటుహక్కు పొందలేకపోతున్నస్కూల్ అసిస్టెంట్ కంటే తక్కువ ర్యాంకు ఉపాధ్యాయులు తమకు కూడా ఈ దఫా ఓటుహక్కు కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వారు విజ్ఞప్తులు పంపుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :