Monday, October 19, 2020

RBI



Read also:

ఏటీఎంల‌లో న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌పై ఛార్జీలు వసూలు చేయ‌రాద‌ని ఆర్‌బీఐ బ్యాంకుల‌ను ఆదేశించింది.


బ్యాంకులు త‌మ పొదుపు వినియోగ‌దారుల‌కు నెల‌కు కొన్ని లావాదేవీలు ఉచితంగా చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తాయి. పరిమితికి మించి ఎక్కువ‌సార్లు లావాదేవీలు చేస్తే ఛార్జీలు వ‌ర్తిస్తాయి. అయితే కొన్ని ర‌కాల లావాదేవీలు ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని బ్యాంకుల‌కు ఆర్‌బీఐ సూచించింది.వాటిని గురించి తెలుసుకుందాం.

1.ఏవైనా సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా లావాదేవీలు ర‌ద్దు అయితే అవి లావాదేవీలుగా లెక్కించ‌కూడ‌ద‌ని తెలిపింది. అటువంటి సంద‌ర్భాల్లో ఛార్జీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని సూచించింది.

2.ఏటిఎం మిష‌న్ల‌లో స‌రిప‌డినంత న‌గ‌దు లేక‌పోవ‌డం, పిన్ నంబ‌ర్ త‌ప్పుగా ఎంట‌ర్ చేయ‌డం వంటి కార‌ణాల చేత లావాదేవీలు ర‌ద్దు అయితే వీటిపై ఛార్జీలు వ‌ర్తించ‌వు.

3.ఖాతాలో బ్యాలెన్స్ వివ‌రాలు, చెక్ బుక్ అభ్య‌ర్థ‌న‌, ప‌న్ను చెల్లింపులు, న‌గ‌దు బ‌దిలీ చేయ‌డం వంటివి లావాదేవీలుగా ప‌రిగ‌ణించ‌కూడ‌దని చెప్పింది.

RBI వార్షిక నివేదిక‌లో, బ్యాంకులు వైట్‌లేబుల్ ఏటీఎంల భాగ‌స్వామ్యంతో కో-బ్రాండెడ్ ఏటీఎం కార్డుల‌ను జారీచేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. దీంతో సొంత బ్యాంకు ఏటీఎంల‌లో లావాదేవీలు జ‌రుపుకునేవారికి బ్యాంకు ఇచ్చే ఉచిత లావాదేవీల ప‌రిమితి పెరిగి ఛార్జీలు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :