Sunday, October 11, 2020

RBI New Debit & Credit Card Terms



Read also:

RBI New Debit & Credit Card Terms

డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులను సురక్షితంగా ఉంచడానికి RBI కొత్త రూల్స్ ను అక్టోబర్ 1 నుండి అమల్లోకి తెచ్చింది. RBI చేసిన కొన్ని తాజా మార్పుల వల్ల పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులు, డిపాజిటర్లు & కస్టమర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. సవరించిన ITRని దాఖలు చేయడానికి గడువుకు సంబంధించిన మార్పులు మరియు క్రెడిట్ & డెబిట్ కార్డుల కోసం కొత్త నిబంధనలు ఇవే.

  • అన్ని కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు మరియు రీఇష్యూ చేసిన కార్డులను దేశీయంగా నిర్వహించే ఏటీఎం, పీఓఎస్ టెర్మినళ్ల వద్ద లావాదేవీలకు మాత్రమే  వినియోగించుకోవచ్చు.
  • ఒకవేళ డెబిట్, క్రెడిట్ కార్డులతో ఆన్లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ, కాంటాక్ట్స్లెస్ లావాదేవీలు నిర్వహించాలనుకుంటే ఆ కస్టమరు తమ బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. ఈ సర్వీసులు ఇకపై డీఫాల్ట్ గా అందుబాటులో ఉండవు. 
  • భారతదేశం బయట కార్డులను ఉపయోగించాలనుకునే వారు అంతర్జాతీయ  లావాదేవీలను ప్రారంభించడానికి ఆయా బ్యాంకులను సంప్రదించాలి. ఇప్పటిదాకా చాలా బ్యాంకులు కార్డులను ప్రపంచవ్యాప్తంగా 
  • ఎక్కడైనా వినియోగించేలా జారీ చేసేవి. కానీ ఇకపై అలా ఉండదు. 
  • డెబిట్ లేదా క్రెడిట్ కార్డులకు ప్రమాదం పొంచివుందని గుర్తిస్తే బ్యాంకులు ఆయా  కార్డులను డియాక్టివేట్ చేయడం లేదా తిరిగి మళ్లీ కొత్త కార్డులను జారీ చేసేందుకు బ్యాంకులకు అధికారం ఉంటుంది. ఏ వ్యకైనా ఆన్లైన్ లావాదేవీలు, అంతర్జాతీయ-లావాదేవీలు, కాంటాల్జెస్ లావాదేవీల కోసం తన కార్డులను ఉపయోగించకపోతే, బ్యాంకు వారి కార్డులకు ఈ సేవలను నిలిపివేయవచ్చు.
  • కస్టమర్లు తమ కార్డును స్విచ్ ఆన్ , స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు.లావాదేవీలు నిర్వహించాలనుకున్నప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందుకు బ్యాంకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ రెండింటిలో కార్డ్ హోల్డర్లు లావాదేవీ పరిమితిని ఎంచుకునే కొత్త సదుపాయాన్ని కల్పిస్తున్నారు. 
  • లావాదేవీల పరిమితుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుగా 24x7 మొబైల్ అప్లికేషన్లు, నెట్ బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించాలని బ్యాంకులను ఆర్బీఐ కోరింది. బ్యాంక్ బ్రాంచు, ఏటీఎం సెంటర్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
  • చాలా బ్యాంకులు నియర్ ఫీల్డ్ 
  • కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీతో కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా స్వెప్ చేయకుండానే చెల్లింపులు చేసుకోవచ్చు. కస్టమర్ కు NFC సదుపాయాన్ని ఎనేబుల్ డిజేబుల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు. 
  • ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు లేదా మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ కార్డులకు ఈ కొత్త నిబంధనలు వర్తించవు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :