Wednesday, October 28, 2020

Rationalization of teachers, the process of transfers is a temporary postponement



Read also:

>Rationalization of teachers, the process of transfers is a temporary postponement

ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలను నవంబరు రెండో తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు హేతుబద్దీకరణ ప్రక్రియ అక్టోబర్‌ 26 వ తేదీతోనే ముగియాల్సి ఉంది.  పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చిన వీరభద్రుడుతో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రతినిధులు మంగళవారం సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అక్టోబరు 31 వరకు ఉండే విద్యార్థుల ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకొని హేతుబద్ధీకరణ, బదిలీలను చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య విన్నవించింది. దీనికి అంగీకరించిన సంచాలకులు నవంబరు రెండో తేదీ వరకు ప్రక్రియను వాయిదా వేశారు.కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తారు.
♦రేషనలైజేషన్‌ ప్రక్రియ కూడా 2 నాటి ‘చైల్డ్‌ఇన్ఫో’ఆధారంగా హేతుబద్ధీకరణ
♦ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల  పేరెంట్స్‌ నుంచి డిక్లరేషన్‌ 
♦మార్గదర్శకాలు జారీచేసిన పాఠశాల విద్య డైరెక్టర్‌

పాఠశాలల్లో రేషనలైజేషన్‌, టీచర్ల బదిలీ ప్రక్రియ వాయిదా పడింది. రేషనలైజేషన్‌ విషయంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయించింది. గతంలో ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటి ‘చైల్డ్‌ ఇన్ఫో’ ఆధారంగా రేషనలైజేషన్‌ చేపట్టాలి. అయితే, మంగళవారం ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) రాష్ట్ర నాయకులతో జరిపిన చర్చల్లో చైల్డ్‌ ఇన్ఫోను అప్‌డేట్‌ చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 29 లేదా అక్టోబరు 31లలో ఏది ఎక్కువైతే దాన్ని పరిగణించాలని ఫ్యాప్టో కోరింది. చైల్డ్‌ ఇన్ఫోను అప్‌డేట్‌ చేసేందుకు ఈ నెల 31 వరకు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేరెంట్స్‌ డిక్లరేషన్‌ స్వీకరించే బాధ్యతను ఎంఈవోలకు అప్పగించాలని ప్రతిపాదించారు. ఆయా అంశాలపై స్పందించిన పాఠశాల విద్య డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు రేషనలైజేషన్‌, టీచర్ల బదిలీలకు సంబంధించి తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలకు రివైజ్డ్‌ షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.

రేషనలైజేషన్‌ కోసం 2.11.2020 తేదీ నాటి ‘చైల్డ్‌ ఇన్ఫో’ను పరిగణనలోకి తీసుకుంటారు. 
ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకారపత్రాలను ప్రధానోపాధ్యాయుడు ఎంఈవోకి అందజేయాలి. 
ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ లేనటువంటి, డ్రాప్‌బాక్స్‌లో ఉన్న విద్యార్థులను చైల్డ్‌ ఇన్ఫో ద్వారా నమోదు చేయాలి.
ఏజన్సీ ప్రాంతాల్లో హిల్‌టాప్‌ ఏరియాను కేటగిరీ-4గా పరిగణిస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :