Friday, October 9, 2020

Rain forecast



Read also:

బంగాళాఖాతంలో అల్పపీడనం-తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశముంది

ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ రోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి  భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.


తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ తెలిపింది.

ఐఎండి సూచనల ప్రకారం.ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసరప్రాంతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది.

వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

శనివారం అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముంది. ఇక ఆదివారం కూడా పలుచోట్ల పిడుగులతో కూడి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చు.

వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలుల వీచే అవకాముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది.

మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. తీరప్రాంత ప్రజలు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.

తెలంగాణలోనూ శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని అధికారులు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :