Sunday, October 11, 2020

Prime Minister Modi initiates the distribution of rural property cards



Read also:

ప్రాపర్టీ కార్డుతో సులువుగా లోన్లు పేదల కోసం ఆధార్ తరహాలో ' స్వమిత్వ ' ప్రాపర్టీ కార్డులను ప్రధాని మోదీ నేడు ఆవిష్కరించారు . ఈ ప్రాపర్టీ కార్డుల్లో ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలుంటాయి . ప్రస్తుత యజమాని వివరాలతో పాటు ఇతర సమాచారమంతా కార్డులపైన కనిపిస్తుంది . పేదలకు ఈ కార్డులే ఆస్తులని , వీటి ద్వారా రుణాలు పొందడం సులువవుతుందని , పేదలను మోసం చేయడం సాధ్యం కాదని మోదీ అన్నారు . రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా ఈ కార్డులను జారీ చేస్తాయి .


కేంద్రం ప్రభుత్వం భూయాజమాన్య సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. స్వమిత్ర ప్రాజెక్టు పేరుతో చేపట్టిన భూ యాజమాన్య సంస్కరణల్లో భాగంగా, ఆధార్‌ తరహాలో ఇళ్ల ఆస్తిహక్కు గుర్తింపు కార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రదానం చేయబోతున్నారు. 763 గ్రామాల్లోని 1,32,000 మంది భూ యజమానులకు తమ ఇళ్లతోపాటు పరిసరాల ఆస్తి భౌతిక కాపీలను అంద జేయనున్నారు. కొన్నేళ్లుగా, దశాబ్దాలు గా కొనసాగుతున్న ఆస్తి వివాదాలకు దీనిద్వారా ముగింపు పలికినట్లు అవుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో భూ యజమానుల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేం దుకు ఈ సంస్కరణ దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది.

ఈ టైటిల్‌ డీడ్లను రుణాల కోసం ఆర్థిక ఆస్తులుగా ఉపయోగించుకునే సౌలభ్యం కలుగుతుంది. గ్రామాల్లోని ఇళ్ల స్థలాలకు పట్టణాల తరహాలో ఆర్థిక ఆస్తులుగా సరైన గుర్తింపు లేదు. వాటిపై రుణాలు పొందడానికీ అవకాశం లేకుం డా వుంది. ఈ సమస్యల కు పరిష్కారంగా, కొత్త తరహా ఆస్తి గుర్తింపు కార్డులు ఉపయోగ పడనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏప్రిల్‌ 4న ప్రధాన మంత్రి ప్రారంభించిన స్వమిత్ర ప్రాజెక్టు కింద టైటిల్‌ డీడ్‌లు అందజేస్తారు. 2024 నాటికి 6.40 లక్షల గ్రామాల, పట్టణ ప్రాంతాలన్నిటినీ ఈ ప్రాజెక్టు మ్యాచ్‌ చేస్తుంది. హర్యానా నుంచి 221, కర్ణాటక 100, మహారాష్ట్ర 100, మధ్యప్రదేశ్‌ 44, యూపీ 346, ఉత్తరాఖండ్‌ 50 సహా మొత్తంగా 763 గ్రామాల్లో ఇంటి యజమానుల టైటిల్‌ డీడ్‌ల భౌతిక కాపీలతోపాటు, డిజిటల్‌ ప్రాపర్టీ కార్డులను అందుకుంటారు. గ్రామీణ భారతదేశానికి సమగ్ర ఆస్తి ధ్రువీకరణ పరిష్కారాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. మారూమూల ప్రాంతాల్లోని నివాసితుల భూమిని డ్రోన్‌ల సహాయంతో సరికొత్త సర్వే పద్ధతులతో గుర్తిస్తారు. ఈ విధమైన రికార్డులతో గృహ యజమానులు తమ ఇళ్లను రుణాల కోసం అనుషంగికంగా ఉపయోగించుకోవడం తోపాటు ఖరీదైన గ్రామీణ వ్యాజ్యాన్ని తగ్గించుకున్నట్లు అవుతుంది. స్థానిక రెవెన్యూ ప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు ఇళ్ల హక్కు రికార్డులను ప్రజల సమక్షంలో గుర్తిస్తారు. అదే సమయంలో దీర్ఘకాలిక భూ వివాదాలను పరిష్కరిస్తారు. చాలా ప్రాంతాల్లో ఇళ్ల భూ యాజమాన్య రికార్డులు సరిగా లేనందున వివాదాలు తలెత్తుతున్నాయి. దాంతో కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. దేశంలోని సివిల్‌ కోర్టుల్లో పెండింగ్‌ కేసుల్లో 40 శాతం గ్రామీణ నివాసిత ప్రాంతాలకు చెందినవే కావడం పరిస్థితి తీవ్రతను చాటుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :